Home

»

Latest News

ఈ నెల 26 న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి!.. వైరల్ అవుతున్నప్రమోద్ శెట్టి వ్యాఖ్యలు 

Feb 21, 2026 11:10AM


  

-రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఈ నెల 26 ఫిక్స్ అయ్యిందా!
-పెళ్లి సందర్భంగా కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలేంటి!
-మరి రష్మిక ఆ ఇద్దరని పీలుస్తుందా!
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం. 

అధికారకంగా ప్రకటించకపోయినా అధికారకంగా చెలామణిలో ఉన్న వార్త రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(vijay Deverakonda)మ్యారేజ్. ఫిబ్రవరి 26 న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో చాలా గ్రాండ్ గా జరగనుందనేది టాక్. మరి ఇద్దరి అభిమానులు సైలెంట్ గా ఉంటారా? పెళ్ళికి సంబంధించిన స్పెషల్స్ చెప్పమని రష్మిక, విజయ్ ల ఇనిస్టాగ్రమ్ అకౌంట్స్ కి కౌంట్ చెయ్యడానికి వీలు లేని మెసేజెస్.ఎక్స్ వేదికగా కూడా సేమ్ సిట్యువేషన్. దీంతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరో వైపు  రష్మిక మమల్ని పెళ్ళికి పిలుస్తుందని అనుకోవడం లేదని ప్రమోద్ శెట్టి(Pramod Shetty)చేసిన వ్యాఖ్యలకి కూడా సోషల్ మీడియా ఆతిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ప్రమోద్ శెట్టి.. కన్నడ చిత్ర సీమలో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్. 2010 లో కెరీర్ ప్రారంభించగా స్టిల్  ముపైకి పైగా చిత్రాలు వచ్చాయి. కాంతార లో గుడ్డి సుధాకర గా మెప్పించాడు. రీసెంట్ గా ప్రమోద్ శెట్టి దగ్గర కొంత మంది మీడియా ప్రతినిధులు రష్మిక వివాహం గురించి ప్రస్తావించారు. దీంతో ప్రమోద్ శెట్టి మాట్లాడుతు రష్మిక తన వివాహానికి నన్ను, రక్షిత్ శెట్టిని  ఆహ్వానిస్తుందని భావించడం లేదు.పిలవకపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. రక్షిత్ శెట్టి(Rakshit Shetty)తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.రష్మిక తో  జరిగిన ఎంగేజ్ మెంట్     రద్దు పై రక్షిత్  ఏమాత్రం బాధపడటం లేదు. ఈ విషయం ఆయన శ్రేయోభిలాషులందరికీ తెలుసని ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చాడు. 

also read:  అల్లు అర్జున్ కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్ 


2017 జులై 3 న రక్షిత్, రష్మిక ల నిశ్చితార్థం జరిగింది.ఇప్పటికి కారణం తెలియదు గాని   పరస్పర అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ కాన్సిల్ చేసుకున్నారు. రష్మిక తొలి చిత్రం 'కిరిక్ పార్టీ' లో ఆ ఇద్దరు జంటగా చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రమోద్ శెట్టి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియా సైలెంట్ గా ఉండటం జరగని పని కదా! పైగా వీకెండ్. దీంతో  రష్మిక తన వివాహానికి రక్షిత్ శెట్టి, ప్రమోద్ శెట్టి ని పిలుస్తుందా లేదా అని పోల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎక్కువ వోట్స్ ని ఆసక్తిగా గమనిస్తున్నారు. 'కిరిక్ పార్టీ' లో ప్రమోద్ శెట్టి చేసిన విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com