నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే విజయ్ దేవరకొండ(Rashmika Mandanna)ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. వీరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే విజయ్, రష్మిక తమ పెళ్లి విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా రష్మికపై ఆమె ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం ఆమె నటించిన ‘కాక్‌టెయిల్2’ చిత్రమే.
షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కతి సనన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రష్మిక, కతి లెస్బియన్స్‌గా నటించారనే వార్త ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎప్ప్పుడూ ఆసక్తి చూపించే రష్మిక.. ఈ తరహా పాత్రలో నటించింది అనే వార్త ఇప్ప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప సిరీస్, యానిమల్, ఛావా, కుబేర వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇప్ప్పుడు ‘కాక్‌టెయిల్2’ చిత్రంలో ఆమె లెస్బియన్‌గా నటించిందనే వార్త అభిమానుల్ని కలవరపెడుతోంది. ఈ విషయంలో ఆమెపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతూ ఇలాంటి పాత్రలు చేయడం ఇప్ప్పుడు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, కతి పాత్రలు ఎంతో కీలకమని తెలుస్తోంది. ఇప్పటివరకు రష్మిక ఈ తరహా క్యారెక్టర్లు చేయలేదు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న విషయమే నిజమైతే రష్మిక కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేకమైన పాత్ర అవుతుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ డిఫరెంట్ షేడ్‌లో కనిపిస్తారని డైరెక్టర్ చెబుతున్నారు. 2012లో విడుదలైన ‘కాక్‌టెయిల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కాక్‌టెయిల్2’ రిలీజ్ అవనుంది. రష్మిక లెస్బియన్‌గా నటించిందని వచ్చిన వార్త, దానికి అభిమానుల నుంచి ఎదురైన నిరసన గురించి రష్మిక ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.







