'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’తో పూజా హెగ్డే రొమాన్స్
on May 29, 2020
పూజా హెగ్డే.. ఈ జనరేషన్ యంగ్ స్టర్స్ హార్ట్ వాయిస్. టాలీవుడ్ యంగ్ స్టార్స్ ఫస్ట్ ఛాయిస్. కెరీర్ ఆరంభంలో ‘ఐరన్ లెగ్’ అనిపించుకున్న ఈ అందం.. గత కొంతకాలంగా వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా టర్న్ అయింది. 'అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల వైకుంఠపురములో’.. ఇలా ఈ మధ్య పూజ నటించిన ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో.. పూజ నుంచి రాబోయే చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రస్తుతం పూజ చేతిలో ఉన్న చిత్రాలన్నింటికీ సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. ప్రెజెంట్ పూజ రొమాన్స్ చేస్తున్న హీరోలందరూ కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ కావడం. పూజ నెక్స్ట్ వెంచర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా టైటిల్‌కి తగ్గట్టే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కావడం విశేషం.
ఇక పూజ చేతిలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. ‘ప్రభాస్ 20’. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.
అలాగే పూజ నటిస్తున్న హిందీ చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలి' విషయానికి వస్తే.. ఇందులో ‘బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఈ భారీ బడ్జెట్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
మొత్తమ్మీద.. అఖిల్, ప్రభాస్, సల్మాన్ ఖాన్.. ఇలా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ తోనే పూజ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ పూజకి ఏ మేరకు కలిసొస్తారో చూడాలి.