'హుషారు'గా రెండో సినిమాకి కమర్షియల్ బాట...
on May 29, 2020

'హుషారు' సినిమాతో హైదరాబాదీ యువకుడు శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆ సినిమాలో 'ఉండిపోరాదే...' పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్. దర్శకుడితో విషయం ఉందని టాలీవుడ్ గ్రహించింది. తమ ఇంట్లో కుర్రాడు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయమని దిల్ రాజు అతడి చేతిలో అడ్వాన్స్ పెట్టారు.
'హుషారు' సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంలో శ్రీహర్ష కొనుగంటి కాస్త కమర్షియల్ బాట పట్టాడు. "నేను ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ రాస్తున్నా. నాలో మాస్ యాంగిల్ కూడా ఉంది. దాన్ని రైటింగ్ లో వాడుకుంటున్నా. అలాగని, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. మాస్ ప్రేక్షకులను కూడా అలరించేలా ఉంటుంది" అని శ్రీహర్ష కొనుగంటి అన్నాడు. లాక్‌డౌన్ సమయంలో మరో ప్రేమకథ కూడా రాశానని ఈ దర్శకుడు తెలిపాడు. ఒక వెబ్ సిరీస్ చేయమని ఆఫర్ వచ్చిందని, అయితే రెండో సినిమా తీసిన తర్వాత ఆ ఆఫర్ గురించి ఆలోచిస్తానని శ్రీహర్ష తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



