Home

»

Latest News

మూడు కోట్లు కట్టాల్సిందేనా: ఆ రోజు ఫ్లైట్ లో ఏం జరిగింది? లీక్ అయిన వీడియోలో ఏముంది!

Sep 8, 2026 11:07AM

 

 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి 'టెంపర్' లో 'ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ,  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'బాహుబలి'లో 'మనోహర' అంటూ ఆడిపాడిన భామ 'నోరా ఫతేహి'. బాలీవుడ్ లో అయితే ఈ అమ్మడి ట్రాక్ రికార్డుకి చాలా విశిష్టత ఉంది. చిందేసిందంటే చాలు బాక్స్ ఆఫీస్ అదనపు వసూళ్లతో తడిసి ముద్దవ్వాల్సిందే.  

 జనరల్ గా  తన గ్లామరస్ డ్యాన్స్ మూమెంట్స్, సోషల్ మీడియా వీడియోలతో నిత్యం వార్తల్లో నిలిచే నోరా, ఇప్పుడు ఒక ప్రైవేట్ విమాన ప్రయాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఏకంగా 3 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి. ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళితే, గత ఏడాది డిసెంబర్‌లో నోరా ఫతేహి ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో 'డ్యూన్స్ ఏవియేషన్' సంస్థకి  చెందిన 'సెస్నా సైటేషన్ సీజే2 '(Cessna Citation CJ2) చార్టర్డ్ విమానంలో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో విమానం లోపలి దృశ్యాలని వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోల్లో సదరు చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి "ఇది చాలా చిన్నగా ఉంది", "ఒక బొమ్మ విమానంలా (Toy Plane)", "లెగో ఎయిర్‌ప్లేన్ (Lego Airplane)" అంటూ  కామెంట్స్ చేసింది.

నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై డ్యూన్స్ ఏవియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టుని  ఆశ్రయించింది. తమ విమానం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలకు కట్టుబడి, చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్‌తో చట్టబద్ధంగా నడుస్తోందని సంస్థ స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను ధృవీకరించుకోకుండా నోరా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. నోరా వ్యాఖ్యల వల్ల తమ సంస్థ గుడ్‌విల్ దెబ్బతినడమే కాకుండా, కస్టమర్లలో నమ్మకం తగ్గి తమ వ్యాపార బుకింగ్స్ ఏకంగా 15 శాతం నుండి 20 శాతం వరకు పడిపోయాయని, పలు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

 

ఈ ఆర్థిక నష్టానికి మరియు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నందుకు గానూ నోరా ఫతేహి నుంచి  3 కోట్ల పరిహారాన్ని డ్యూన్స్ ఏవియేషన్ డిమాండ్ చేస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో ఉన్న వీడియోలని తక్షణమే తొలగించి, బహిరంగంగా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పాలని కోరింది. గాంధీనగర్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, సెప్టెంబర్ 25న తదుపరి విచారణను చేపడుతుండటంతో నోరాకు ఇప్పటికే కోర్టు నోటీసులు పంపినట్లు సమాచారం. సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక విమానయాన సంస్థ ప్రతిష్ట దెబ్బతీసి, చివరకి కోర్టు మెట్లు ఎక్కించేంత పెద్ద వివాదంగా మారుతాయని, మూడు కోట్ల పరువు నష్టం దాకా వెళ్తుందని   బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. అందుకే అంటారు అవసరం లేకుండా  అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదని, అలా ప్రదర్శిస్తే టంగ్ కంట్రోల్ లో ఉండే అవకాశం మాగ్జిమమ్ మన చేతుల్లో ఉండదని.

 

 

[Nora Fatehi, Defamation Case, 3 Crore, Cessna Citation CJ2, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com