Home

»

Latest News

హీరో కార్తి రిక్వెస్ట్: ‘సర్దార్ 2’ చూసే ముందు ఆ సినిమా ఫ్రీగా చూడండి.!

Sep 8, 2026 10:43AM

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి మాట్లాడుతూ.. "సర్దార్ సినిమాకు ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో,  ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి  ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలు చేయడం మనకు కుదరదా అని అనిపించేది. అది ఈ సినిమాతో తీరింది. మిత్రన్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. మ్యూజిక్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇలాంటి పెద్ద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. మా నిర్మాతలకు థాంక్యూ. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగార్జున గారికి, సుప్రియ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి ధన్యవాదాలు. ఆషికా, మాళవిక సినిమాలో మంచి పాత్రలు చేశారు. ఈ సినిమాలో డాన్స్ లేదు.. యాక్షన్ ఉంటుంది. గర్ల్ పవర్ చూడబోతున్నారు. SJ సూర్య గారిని మీరు వేరే రకంగా ఇందులో చూస్తారు. అందరూ ఎంజాయ్ చేసే విలన్‌గా చేశారు. షామ్ సీఎస్‌కి ఇది వందో సినిమా. ‘ఖైదీ’ తర్వాత తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎప్పుడూ కూడా మీరు తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటారు. ‘హిట్ 4’ సినిమా వస్తుంది. అంతకుముందు కళ్యాణ్ శంకర్‌తో సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను." అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. "నా ఫేవరెట్ సినిమాల్లో కార్తీ గారివే ఎక్కువ. ఆవారా, ఖైదీ, ‘సత్యం సుందరం’ ఈ సినిమాలన్నీ ఇష్టం. అలాగే నాకు ‘సర్దార్’ సినిమా కూడా చాలా ఇష్టం. స్పై సినిమాల్లో మాస్ మసాలా ఫిలిం ‘సర్దార్’. ఈ సినిమాని నేను థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేశాను. సర్దార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. మాళవిక, ఆశికా రంగనాథన్, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్." అన్నారు.

ఎస్.జె. సూర్య మాట్లాడుతూ.. "సర్దార్ ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ‘సర్దార్ 2’ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్, యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ మిత్రన్ గారు అద్భుతమైన కథతో సినిమాని ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. డైరెక్టర్ గారు ఫ్యూచర్‌కి ఏం కావాలో అనే ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ సినిమాని మీరు గుండెల్లో పెట్టుకోవాలి. ఆలోచించాలి. కార్తీ గారు మంచి కథలకు ఎప్పుడూ ఆమోదం తెలుపుతారు. ఆయన సినిమాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. కార్తీ గారు ఒక ఏజెంట్‌గా ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్ చేశారు. ఇందులో రెండు గెటప్స్ ఉన్నాయి. చాలా సిన్సియర్‌గా చేశారు. ఆయన ఈ సినిమా మీద పెట్టిన ప్రేమ కోసం మీరందరూ సెప్టెంబర్ 10న సినిమా చూసి చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను." అన్నారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "తెలుగు  సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో ‘సర్దార్ 2’ సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా ఇదే దోవలో అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘సర్దార్’ ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. కార్తీ గారు, సూర్య గారు డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే వాళ్లిద్దరూ చాలా మంచి మనసున్న మనుషులు. వాళ్లిద్దరూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. అందుకే ప్రేక్షకులు కూడా ఇంత పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మిగతా సినిమాలన్నీ కూడా మంచి సినిమాలు అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమ సక్సెస్ రేట్ ఇలాగే ముందుకు వెళ్లాలి. కార్తీ గారితో ప్రత్యేకమైన పరిచయం ఉంది. ఆయన ఎలాంటి మనిషో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా మొదటి రోజు చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం." అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహన్ మాట్లాడుతూ: సర్దార్ చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. . కార్తీక్ గారు ఇన్‌స్పైరింగ్ కోస్టార్. చాలా జెంటిల్‌మ్యాన్. సూర్య గారు కూల్ విలన్. చాలా మంచి యాక్షన్, యాక్షన్ డ్రామా ఉన్న సినిమా ఇది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. "సర్దార్ 2 నాకు చాలా స్పెషల్ సినిమా. నేను చేస్తున్న ఫస్ట్ యాక్షన్ జానర్. అలాగే కార్తీక్ గారితో చేస్తున్న తొలి సినిమా. సర్దార్ చాలా ఇంపాక్ట్ చేసింది. దానికంటే ఈ సినిమా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది." అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2 కూడా సినిమా స్థాయికి తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కార్తీక్ గారు పాన్ సౌత్ స్టార్. ఆయన సినిమాలు అందరికీ ఇష్టం. సర్దార్ 2 కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆ సినిమాతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను." అన్నారు.

డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. "సర్దార్ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్. ఆ సినిమాకి మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. ఈ సినిమా తెలుగు వెర్షన్ చూశాను. సర్దార్ ఎంట్రీ అదిరిపోతుంది. ఎస్జే సూర్య గారి హ్యాండ్ చాలా మంచిది. ఒకరిని సీఎం చేశారు, మరొకరిని డిప్యూటీ సీఎం చేశారు. ఈ సినిమా అదిరిపోవాలి." అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "ఆవారాలో కార్తీ గారిని ఎలా చూశారో, మా సినిమాతో కళ్యాణ్ అలా సినిమా చూపించబోతున్నాడు. సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. సర్దార్ తెలుగులో చాలా పెద్ద హిట్. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను." అన్నారు. 

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. "తెలుగు పరిశ్రమలో కార్తి అంటే అందరికీ ఇష్టం. సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమా కార్తి గారి రికార్డులన్నీ రీ-క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను." అన్నారు.

 

 

 

 

[Sardar 2 Pre Release Event, Hero Karthi, SJ Suryah, Adivi Sesh, Boyapati Srinu, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com