అతను లేకపోతే మిమ్మల్ని ఎలాగైనా పెళ్లి చేసుకునేవాడిని
on Nov 5, 2022

సిరి హన్మంత్ యూట్యూబర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఆడుతున్న శ్రీహాన్ ఫ్రెండ్ గా అందరికీ తెలుసు. అలాంటి సిరి శ్రీహాన్ హౌస్ లోకి వెళ్లిన దగ్గరనుంచి తరచూ తన ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేస్తూ శ్రీహాన్ ని గెలిపించడానికి చాలా ట్రై చేస్తోంది. "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" పేరుతో ఉన్న ఒక టాస్క్ ని రెగ్యులర్ గా ఇస్తూ నెటిజన్స్ ఒపీనియన్స్ ని తెలుసుకుని వాళ్ళతో వోటింగ్ చేయిస్తోంది. ఇక ఇప్పుడు కూడా ఆలాంటి టాస్క్ ఒకటి ఇచ్చింది. ఇక అందరూ శ్రీహాన్, ఇనాయ గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటే సిరి ఆన్సర్స్ చేసింది. ఇక అందులో ఒక కొంటె నెటిజన్ మాత్రం " మీ లైఫ్ లో శ్రీహాన్ లేకపోతే మీ కాళ్ళు పట్టుకుని ఐనా మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని" అని వెరైటీ గా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసాడు.
దాంతో సిరి "ఒడియమ్మ" అని రిప్లై ఇచ్చింది. ఇది తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఇక ఇంకో నెటిజన్ "అక్కా బావకి సపోర్ట్ చేయడానికి బీబీ కేఫ్ కి రా" అని అడిగేసరికి "అక్కడికి వస్తే అందరి గురించి జడ్జిమెంట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఎవరినీ జడ్జి చేసే పరిస్థితిలో లేను. చూస్తా నా మూడ్ బట్టి" అని ఆన్సర్ చేసింది. "శ్రీహాన్ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని ఇంకో నెటిజన్ అడిగేసరికి "బేబీ, సిరి" అని పిలుస్తాడని రిప్లై ఇచ్చింది సిరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



