సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి కలయిక 'RC 16' కోసమేనా!
on Nov 5, 2022

దర్శకులు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తాజాగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'పుష్ప'తో సుకుమార్, 'ది కాశ్మీర్ ఫైల్స్'తో వివేక్ అగ్నిహోత్రి సంచలన విజయాలను అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారితో కలిసి 'ది కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ-2' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రాజెక్ట్ ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ ముగ్గురి కలయిక 'RC 16' కోసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం తన 15వ సినిమాని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్ తన 16వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించి ఇటీవల డ్రాప్ అయ్యాడు. దీంతో 'RC 16' ఏ దర్శకుడితో ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సుకుమార్ పేరు కూడా బలంగా వినిపించింది. ఇక ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ తో సుకుమార్ కలయిక 'RC 16' కోసమేనని అంటున్నారు.


సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలయిక 'RC 16' కోసమేనంటూ నెటిజన్లు ట్వీట్స్ చేయగా వివేక్ అగ్నిహోత్రి వాటిని రీట్వీట్ చేశాడు. అలాగే ఒక నెటిజన్ రామ్ చరణ్, వివేక్ అగ్నిహోత్రి కలయికలో 'రజాకార్ ఫైల్స్' అని ట్వీట్ చేయగా.. దానిని కూడా వివేక్ అగ్నిహోత్రి రీట్వీట్ చేశాడు. దీనిని బట్టి చూస్తే ఈ ముగ్గురి కలయిక ఖచ్చితంగా 'RC 16' కోసమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అభిషేక్, వివేక్ నిర్మాణంలో చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందో లేక చరణ్ హీరోగా వివేక్ దర్శకత్వంలో రూపొందే 'రజాకార్ ఫైల్స్'కి అభిషేక్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



