కుర్ర హీరోని గాంధీ కూడా గట్టెక్కించలేకపోయాడు!
on Nov 4, 2022

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'(2013)తో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా 'ఎక్స్ ప్రెస్ రాజా'(2016)తోనూ ఆకట్టుకున్న ఆయన మూడో సినిమా 'కృష్ణార్జున యుద్ధం'(2018)తో మాత్రం నిరాశపరిచాడు. ఆ తర్వాత ఆయన స్టోరీ అందించిన 'ఏక్ మినీ కథ', ఆయన డైరెక్ట్ చేసిన 'మాస్ట్రో' నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. నాలుగేళ్ళ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి థియేటర్స్ లో విడుదలైంది. అదే 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. ఈ సినిమాతో ఆయన విజయాన్ని అందుకొని, యంగ్ హీరో సంతోష్ శోభన్ కి కూడా విజయాన్ని అందిస్తాడు అనుకుంటే మరోసారి నిరాశపరిచాడు.
దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నిలబడటానికి తెగ కష్టపడుతున్నాడు. 'తను నేను', 'పేపర్ బాయ్', 'ఏక్ మినీ కథ', 'మంచి రోజులొచ్చాయి' ఇలా ఎన్ని సినిమాలు చేసినా హీరోగా సరైన బ్రేక్ రావట్లేదు. ఈ క్రమంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఒక చిన్న పాయింట్ అనుకొని, దాని చుట్టూ కామెడీ అల్లుకొని అలరించడం మేర్లపాకకు అలవాటు. అదే స్టైల్ లో తన మొదటి రెండు సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'కి కూడా అదే స్టైల్ ఫాలో అవ్వడంతో.. తాను హిట్ అందుకొని, కుర్ర హీరో సంతోష్ కి కూడా హిట్ అందిస్తాడని భావించారంతా. కానీ ఈరోజు(నవంబర్ 4న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆడియన్స్ చేత లైక్స్ కొట్టించుకునేలా లేదని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



