Home

»

Latest News

'సీన్' టైటిల్ టీజర్: ఆవేశం డైరెక్టర్‌తో సూర్య ఊరమాస్ హంగామా.!

Sep 9, 2026 7:42PM

కోలీవుడ్ స్టార్ సూర్య బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 'కరుప్పు', 'విశ్వనాథ్ & సన్స్' వంటి వరుస సక్సెస్ లతో థియేటర్లను షేక్ చేసిన సూర్య, తన తదుపరి చిత్రం 'సీన్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

'ఆవేశం', 'రోమాంచం' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో సౌత్ ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సీన్' టైటిల్ టీజర్ ఈరోజే సోషల్ మీడియాలో విడుదలై తుఫాను సృష్టిస్తోంది!.

టీజర్ ప్రారంభంలోనే ఒక పవర్ ఫుల్ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్, సెంట్రల్ జైలు వాతావరణాన్ని చూపించారు. అక్కడ ఉండే ఇతర పోలీస్ అధికారులు భయపడుతూ... "ఇన్బరాజ్ సర్ వస్తున్నారు, అందరూ లోపలికి వెళ్లండి. ఆయనొస్తే ఖైదీలు ఎర్రాటిక్‌గా బిహేవ్ చేస్తారు" అని హడావుడి చేయడం నుంచే క్యారెక్టర్ బిల్డప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ఇక ఆ తర్వాత మన సూర్య ఎంట్రీ... సింప్లీ మైండ్ బ్లోయింగ్. చేతిలో సిగరెట్, కళ్లలో ఒక విచిత్రమైన సైకోయిజం విత్ స్వ్యాగ్, పక్కన పోలీస్ మెడ మీద చెయ్యి వేసుకొని జైలు బ్యారెక్స్ గుండా నడుచుకుంటూ వచ్చే ఆ సీన్ టీజర్‌కే హైలైట్. "నీ దృష్టిలో నిన్ను అరెస్ట్ చేసిన ఏకైక పోలీస్ ఆఫీసర్‌ని నేను కావచ్చు... కానీ నా దృష్టిలో నేను జైలుకి పంపిన వేలమంది క్రిమినల్స్‌లో నువ్వు ఒక సాధారణ క్రిమినల్‌వి మాత్రమే" అంటూ సూర్య చెప్పే రఫ్ అండ్ టఫ్ డైలాగ్స్ అండ్ వాయిస్ బేస్ వింటుంటే పూస్‌బంప్స్ రావడం ఖాయం.

ఈ చిత్రంలో సూర్యతో పాటు నజ్రియా నజీమ్, నాస్లేన్ వంటి ప్రొమిసింగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతిక-సూర్య కలసి 2D ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఝాగరమ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ టీజర్‌కి ప్రధాన ఆకర్షణ సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఆవేశం సినిమాలో ఎలాంటి ట్రెండీ అండ్ మాస్ మ్యూజిక్ ఇచ్చాడో, ఇక్కడ కూడా తన బిజీఎమ్‌తో ప్రతీ ఫ్రేమ్‌ని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు.

టీజర్ ముగింపులో నవంబర్ 6న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అంటే ఈ దీపావళికి థియేటర్లలో సూర్య మాస్ జాతర ఖాయంగా కనిపిస్తోంది.

 

 

[Suriya, Scene Movie, Title Teaser, Jithu Madhavan, Nazriya Nazim, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com