Home

»

Latest News

Malaika arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు

Feb 24, 2026

 


-అర్జున్ కపూర్ తో విడిపోయాక ఒంటరిగానే ఉంటున్న మలైకా 
-కెవ్వు కేక సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తురాలే 
-రీసెంట్ గా బిజినెస్ మాన్ తో ప్రేమలో పడినట్టుగా పుకార్లు 
-ఇంతకీ అతను ఎవరు 
-ఏజ్ గ్యాప్ కూడా వైరల్  


పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి 'కెవ్వుకేక' సాంగ్ చేయడం ద్వారా ఓవర్ నైట్ తెలుగు ప్రేక్షకుల మనసులని గిలిగింతలు పెట్టింది మలైకా అరోరా(Malaika Arora).'మున్ని బదనాం హోయి' అని సల్మాన్ తో కూడా చిందులేసిన మలైకా సినీప్రస్థానానికి సుదీర్ఘ హిస్టరీ నే ఉంది. కాకపోతే స్పెషల్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన రష్మిక, ఆయుష్మాన్ ఖురానా 'థామ' లోని 'పాయిజన్ బేబీ' సాంగ్ లోను చేసి అభిమానులని మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో మలైకా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోను సదరు వార్త వేడి వేడి న్యూస్. మరి సదరు న్యూస్ ఏంటో చూద్దాం.


మలైకా అరోరా 2018 నుంచి ఏజ్ లో తనకంటే పన్నెండు సంవత్సరాల చిన్నవాడైన ప్రముఖ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి భర్త బోణి కపూర్ మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. కానీ గత ఏడాది ఆ ఇద్దరు విడిపోయారు. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న మలైకా ఇప్పుడు హర్ష్ మెహతా తో డేటింగ్ లో ఉన్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ భావిస్తున్నాయి. రీసెంట్ గా ముంబై లో  ఒక సంగీత కార్యక్రమం జరిగింది. అందులో ఈ ఇద్దరు జంటగా కనిపించడంతో పాటు సెల్ఫీ కూడా తీసుకున్నారు.సెల్ఫీ తీసుకుంటున్న మాత్రానికే ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడమేనా అని అనుకోవచ్చు. మొన్న వాలైంటెన్స్ డే నాడు ఈ ఇద్దరు  ఫారిన్ లో ఉన్నట్లు చెప్తున్నారు. తరుచు ముంబైలో జరిగే పార్టీలకి కూడా  కలిసే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రముఖంగా వస్తుండటంతో అభిమానులు, నెటిజెన్స్ హర్ష్ మెహతా  గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. 

Also read: Samantha: నమ్మకం కోల్పోయానంటున్న సమంత.. చికాకు తెప్పించే జోడి!


హర్ష్ మెహతా(Harsh Mehta)ఒక వజ్రాల వ్యాపారి. హర్ష్ సంకాస్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. హర్ష వయసు 33 సంవత్సరాలు. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే  మలైకా వయస్సు 52 సంవత్సరాలు. అంటే ఆ ఇద్దరి మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అభిమానులు మాత్రం ప్రేమకి ఏజ్ తో సంబంధం ఏముందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. పర్సనల్ విషయాలని సైతం  డేర్ గా వెల్లడి చేయడంలో మల్లికా  స్పెషలిస్ట్. ఈ నేపథ్యంలో హర్ష్ మెహతా రిలేషన్ పై ప్రకటన చేస్తుందేమో చూడాలి. మలైకా 1998 లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకుంది. చిరంజీవి నుంచి వచ్చిన జై చిరంజీవ మూవీలో అర్బాజ్ విలన్ గా చేసి మెప్పించాడు . 2017 లో ఆ ఇద్దరు విడాకులు తీసుకోగా ఒక కొడుకు కూడా ఉన్నాడు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com