
-కేరళ సద్య ఇదే అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్
-పోటీగా కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్
-ప్రశ్నలు లేవనెత్తడమే నా పని
ది కేరళ స్టోరీ పార్ట్ 2(The Kerala Story 2)ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదలకి రెడీ అవుతుంది.కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఒక ముస్లిం కుటుంబం యువతికి బలవంతంగా బీఫ్ తినిపిస్తున్న సన్నివేశం ఉంది. సదరు సన్నివేశాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్(Prakash Raj)ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో శాఖాహార కేరళ సద్యతో పాటు బీఫ్, పోర్క్, చేపల వంటి వంటకాలతో కూడిన ఫోటోలని షేర్ చేస్తు, ఇవి నిజమైన కేరళ రాష్ట్ర నిజమైన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అన్ని రకాల వంటకాలు కలిసి సామరస్యంగా ఉండటమే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండనే క్యాప్షన్ ఉంచాడు.
ప్రకాష్ రాజ్ ట్వీట్ పై కేరళ స్టోరీ పార్ట్ 2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్(Kamakhya Narayan Singh) స్పందిస్తు ప్రకాష్ రాజ్ చాలా ఉన్నత స్థాయి నటుడు అని అనుకునేవాడిని. కానీ అతను మానవుడితో సమానంగా తక్కువ స్థాయిలో ఉన్నాడని భావిస్తున్నాను.బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడం, మతమార్పిడిలు చేయడం తప్పు కాదా! ప్రకాష్ రాజ్ మనస్సాక్షిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. భారతదేశంలోని నాగరిక సమాజం ఎవరినైనా తమ మతాన్ని మార్చడానికి బలవంతంగా గొడ్డు మాంసం తినమని చేయడాన్ని ఎప్పటికీ అంగీకరించదు. అతను మేధోపరంగా దివాలా తీసాడు. మాత మార్పిడులనే దుష్ట శక్తి త్వరగా అంతమవ్వాలనేది మా ఆశ. నా సినిమాలు ఎప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతాయి అతను ఏమి తింటాడో నాకు తెలియదు. కానీ అతని ప్రకటనలు బట్టి ఏం తింటాడో అర్ధం చేసుకోవచ్చు.
also read: Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు
కేరళని ఒక రాష్ట్రంగా లక్ష్యంగా చేసుకోవడం లేదు.కేరళ దేవుని దేశం. ఆ రాష్ట్రంలోని చెడుని వీలైనంత త్వరగా నిర్మూలించాలని మేము కోరుకుంటున్నాని కామాఖ్య నారాయణ్ సింగ్ తెలిపాడు. అస్సాం క్యాప్టిల్ గౌహతి కి చెందిన కామాఖ్య నారాయణ్ సింగ్ ఇప్పటి వరకు డాక్యుమెంటరీ తో కూడిన ఐదు షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. అవన్నీ కూడా సామాజిక ప్రయోజనంతో కూడుకున్నవే. 'జస్టిస్ డిలేయిడ్ బట్ డెలివర్డ్' కి నేషనల్ అవార్డు అందుకున్నాడు. కేరళ స్టోరీ పార్ట్ 2 నే తొలి చిత్రం.









