ENGLISH | TELUGU  

త‌ల అజిత్ ద‌ర్శ‌కునితో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్!

on Jan 27, 2023

ఇటీవల కోలీవుడ్ స్టార్ తల అజిత్ హీరోగా తునీవు చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 11న చిత్రం విడుదలయింది. తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం తెలుగులో తెగింపుగా డబ్బింగ్ అయ్యింది. మొదటిరోజు పోటీ లేకపోవడంతో కలెక్షన్లు కాస్త పర్వాలేదనిపించాయి కానీ పక్క రోజు నుంచి బాలయ్య చిరులు రావడంతో తెగింపు సందడి ఒక రోజుకే ముగిసింది కాగా ఈ తునివు  చిత్రానికి హెచ్ వినోద్ దర్శకుడు. సినిమాలో లాజిక్కులు ఏమైనా ఉన్నాయా? అసలు కథా బలం అంటూ ఉందా?  అనే అంశాలను పక్కన పెడితే అజిత్ నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో వాటిని హెచ్ వినోద్  త‌ల అజిత్ అభిమానుల‌కు  అందించారు.  అజిత్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేకూర్చారు. అజిత్ స్టార్ డంకు తగ్గ చిత్రాన్ని చేసి చూపించారు. ముఖ్యంగా అజిత్ ను ఎలివేషన్స్ లో చూపించిన విధానం కోలీవుడ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. 

ఇక విషయానికి వస్తే కమలహాసన్ ప్రస్తుతానికి తన కెరీర్‌లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల వచ్చిన విక్రం ఆయన కెరీర్ లోనే భారీ బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్  చిత్రంగా నిరూపించుకుంది. శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. తాజా  సమాచారం ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్ డైరెక్షన్‌లో కమలహాసన్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది ఓ మంచి మాస్ మసాలా చిత్రంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.అజిత్ తో  నెరకొండ, పారువాయి, వలిమై లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్న వినోద్ చెప్పిన కథకు కమలహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్  ఫిలిం ఇంటర్నేషనల్ ప‌తాకంపై  కమల్ సొంతంగా నిర్మించబోతున్నట్లు సమాచారం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.