
ఫుట్ బాల్ మాంత్రికుడు, రెప్పపాటులో ప్రత్యర్థుల బుర్రలకి అంతుచిక్కని విధంగా గోల్ కొట్టే 'లియోనెల్ మెస్సీ' మైదానంలో ఆడుతుంటే, అందుకు తగట్టుగా బ్యాక్ గ్రౌండ్ లో తెలుగు జానపద సాంగ్ వస్తు ఉంటే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుందో కదా! ఇప్పుడు సోషల్ మీడియా ఆ విడియోతోనే ఇది నా రేంజ్ అని తెగ మురిసిపోతూ ఉంది. పూర్తి మ్యాటర్ చూద్దాం.
మన తెలుగు నేల నుంచి పుట్టిన ఒక అచ్చమైన జానపద పాట ఏకంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. సాధారణంగా గ్రామాల్లో, స్థానిక వేడుకల్లో మారుమోగే జానపద బాణీలు గ్లోబల్ స్టేజ్‌పై సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న "జిమ్ జిమ్ తార" (Jim Jim Taara) తెలుగు ఫోక్ సాంగ్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రాక్టీస్ సెషన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్ మయామి ప్రాక్టీస్ గ్రౌండ్‌లో మెస్సీ మరియు ఇతర ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్‌కు ఈ తెలుగు ఫోక్ బీట్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. "జుమ్ జుమ్ తార" అంటే ఏదో లోకల్ అనుకుంటివా, ఇది ఇంటర్నేషనల్ రేంజ్ అంటూ తెలుగు నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జైలర్ 2 vs రణబాలి: బాక్సాఫీస్ వద్ద ఆ హిస్టరీ ఆసక్తికరం

అమెరికాలోని ఎన్ఆర్ఐలు (NRIs) సైతం ఈ మాస్ కనెక్షన్‌ను చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి రీల్స్ మరియు ఎడిట్స్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించినప్పటికీ, మన ప్రాంతీయ సంగీతం గ్లోబల్ ఐకాన్ల వీడియోలకు సింక్ కావడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణంగా మారింది. కేవలం స్థానిక ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా, విదేశీ బీట్స్‌ను సైతం తనదైన జానపద శైలితో కట్టిపడేస్తున్న ఈ ట్రెండ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మన మట్టి వాసన ఉన్న జానపద పాటల జోరు చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు ఫోక్ మ్యూజిక్ మరింత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని సినీ, సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
[Jim Jim Taara Song Viral Inter Miami Messi, Jim Jim Taara song, Telugu folk song viral, Lionel Messi Inter Miami, Jim Jim Tara trend, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]




