Home

»

Latest News

ఆర్యతో వైష్ణవీ చైతన్య రొమాన్స్.. తెలుగు ప్రేక్షకుల కోసం ‘హలో ప్రేమ’!

Oct 13, 2026 11:41AM

హీరో ఆర్య నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హలో కాదల్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఆర్య హీరోగా నటిస్తున్న 40వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

దర్శకుడు నిఖిల్ మురళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆర్య సరసన నిఖిల విమల్, వైష్ణవీ చైతన్య కథానాయికలుగా నటిస్తున్నారు. విమానంలో నిఖిల విమల్, వైష్ణవీ చైతన్య మాట్లాడుకునే సన్నివేశాలతో టీజర్ ప్రారంభమవుతుంది. వైష్ణవీ చదువుతున్న పుస్తకంలోని ప్రేమకథ గురించి నిఖిల అడగడంతో కథలోని ఆసక్తికరమైన అంశాలు పరిచయమవుతాయి. వైష్ణవీ చెప్పే ప్రేమకథలో ఆర్య కీలకంగా కనిపిస్తాడు. చివర్లో తన భర్తతో ఉన్న ప్రేమకథ మరింత ఆసక్తికరంగా ఉంటుందని నిఖిల చెప్పడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జీవా శంకర్ నిర్వహిస్తుండగా, బిను నేపోలియన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రణయ విలాసం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రచయితలు సునూ ఏవీ, జ్యోతిష్ ఎం ఈ సినిమా కథా రచనలో భాగమయ్యారు. దర్శకురాలు హలితా షమీమ్ అదనపు స్క్రీన్‌ప్లే, సంభాషణల బాధ్యతలు చేపట్టారు.

ఆర్య, ఆయన భార్య సాయేషా తమ నిర్మాణ సంస్థ ది షో పీపుల్‌తో పాటు సిల్వర్ గ్రెయిన్ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ తమిళ సినిమా తెలుగులో ‘హలో ప్రేమ’ పేరుతోనూ విడుదల కానుంది. ప్రేమ, వినోదం, ప్రయాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

[Arya Hello Kadhal Movie, Hello Kadhal Teaser, Arya 40th Film, Vaishnavi Chaitanya Tamil Movie, Nikhila Vimal Hello Kadhal, Hello Prema Telugu Release, Hello Kadhal Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com