Home

»

Latest News

టాక్సిక్: మూవీ చూసిన జపాన్ లేడీ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.. ఫ్యాన్స్ హడావిడి  

Aug 29, 2026 5:59PM

 

నటనకి సంబంధించిన అన్ని రకాల వేరియేషన్స్ ని ప్రదర్శించి  పదులు, వందల సినిమా చేసినా చాలా మంది హీరోలకి రాని క్రేజ్ 'కేజిఎఫ్' అనే ఒకే ఒక్క సినిమాతో యష్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్ స్థాయి ఎంతలా ఉందంటే జపాన్ లేడీస్ సైతం యష్ కి వీరాభిమానులుగా మారిపోయారు. 

దీంతో లేటెస్ట్ యష్ బొమ్మ  టాక్సిక్ ని చూసిన జపాన్ లేడీ ఫాన్స్  టాక్సిక్ పై స్పందిస్తు 'టాక్సిక్ సూపర్ గా ఉంది. రాయగా యష్ నటన ఒక రేంజ్ లో ఉందని చెప్తున్నారు.  ఇప్పుడు ఈ వీడియోని యష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరి సినిమా ప్లాప్ అంటారేంటి, టాక్సిక్ హిట్ అనటానికి ఇదే ఒక ఉదాహరణ అనే కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్‌ సరసన ఆ యంగ్ భామ? ట్విస్ట్ ఏంటంటే!


జపాన్‌లో భారతీయ సినిమాలకు ఉన్న ఆదరణ సాధారణంగా ఎక్కువే అయినప్పటికీ, మాస్ యాక్షన్ హీరో అయిన యష్ సాధించిన ఈ ఫాలోయింగ్ నిజంగా అరుదైన మైలురాయిగా నిలిచింది. టోక్యోలోని ఒక ప్రముఖ ఐకాన్ థియేటర్‌లో 95% పైగా ఆక్యుపెన్సీ నమోదు కాగా, వారిలో దాదాపు 60% మంది మహిళా ప్రేక్షకులే ఉండటం విశేషం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి వంటి బలమైన నటీమణుల పాత్రలు ఉండటం కూడా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ప్రదర్శన సమయంలోనే కాకుండా, షో ముగిసిన తరువాత కూడా లేడీ ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం, ఒకరినొకరు కౌగిలించుకుంటూ యష్ నటనను కొనియాడటం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ అంశంగా మారింది.

 

 

[Toxic, yash, Japan lady Fan, Telugu Cinema News, Latest Telugu Film News, TeluguOne Cinema News, TeluguOne]

 

 


 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com