Home

»

Latest News

ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్‌ సరసన ఆ యంగ్ భామ? ట్విస్ట్ ఏంటంటే!

Aug 29, 2026 5:23PM

 


మ్యూజిక్ కి ఎక్స్ పైరీ డేట్ ఉండదనే నిజాన్ని నిరూపించిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకడు. తన తొలి సినిమా సాంగ్ నేటికీ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో చెలరేగిపోతుందంటే దేవి సంగీత సునామీని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు హీరోగానూ సత్తా చాటాలని  'ఎల్లమ్మ' తో వస్తున్నాడు. 'బలగం'తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న వేణు యెల్దండి దర్శకుడు.


దేవికి  జోడీగా నటించే హీరోయిన్స్  విషయంలో సినీ ప్రియులలో ఎంతో ఆసక్తి నెలకొంది. మొదట సాయి పల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి అగ్ర శ్రేణి కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా 'అనంతిక సనిల్‌కుమార్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. '8 వసంతాలు' చిత్రంతో తన సహజసిద్ధమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనంతికపై ఇప్పటికే ఫోటోషూట్ మరియు టెస్ట్ షూట్ నిర్వహించినట్లు సమాచారం. ఈ టెస్ట్ షూట్‌లో అనంతిక స్క్రీన్ ప్రెజెన్స్, సాంప్రదాయ లుక్ మరియు నటన పట్ల చిత్ర దర్శకుడు వేణు యెల్దండితో పాటు నిర్మాత దిల్ రాజు ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కాస్టింగ్ ప్రతిపాదనపై దేవి శ్రీ ప్రసాద్ కొన్ని సందేహాలు లేదా అభ్యంతరాలు వ్యక్తం చేశారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ఈ కథానాయిక ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Also Read: బోల్డ్ కామెంట్స్ : ఇలా కూడా మాట్లాడతారా.. నా ఫ్రెండ్స్ లో వాళ్లే ఎక్కువ!

 ఇప్పటికే విడుదలైన 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ మరియు టీజర్ గ్లింప్స్‌లో దేవి శ్రీ ప్రసాద్ రగ్గడ్ గడ్డం, పొడవాటి జుట్టుతో విభిన్నమైన ఇంటెన్స్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. గ్రామీణ నేటివిటీ, బలమైన జానపద మూలాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

[Yellamma, Anathika sanilkumar, Venu yellnadi, TeluguCinema, TeluguNews, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com