
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ఒక్కటే పేరు మారుమోగిపోతోంది.. అదే 'ఇరుముడి'. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. అసలు ఎటువంటి హంగులు లేని ఒక ప్యూర్ ఎమోషనల్ అండ్ డివైన్ కంటెంట్‌తో ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు.
సీలేరు ప్రాంతంలో ఆటో నడుపుకునే త్రినాథ్ అనే సగటు తండ్రి పాత్రలో రవితేజ జీవించేశారు. తన కూతురు మణెమ్మే తన ప్రపంచంగా భావించే త్రినాథ్, ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా తన బిడ్డలాగే అండగా నిలబడతాడు. కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి ఆయన పాటించే నిష్ఠ, అలాగే ఊరి గురుస్వామి కూతురు మిస్ అయినప్పుడు త్రినాథ్ పడే తపన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తుంది. 'మల్లెపూల పల్లకి' పాట నుండి క్లైమాక్స్ వరకు దర్శకుడు శివ నిర్వాణ డివైన్ ఎలిమెంట్స్‌ని, ఫాదర్-డాటర్ ఎమోషన్‌ని బ్లెండ్ చేసిన తీరు థియేటర్లలో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఫస్ట్ వీకెండ్ మాత్రమే కాదు.. వీక్‌డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో 'ఇరుముడి' అన్-స్టాపబుల్ రన్ కొనసాగిస్తోంది. కేవలం నైజాం రీజియన్‌లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, బయ్యర్లకు లాభాల వర్షం కురిపిస్తోంది. రవితేజ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
మాస్ మహారాజాలోని కంప్లీట్ యాక్టర్‌ని బయటకు తీసి, కుటుంబ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు, యూత్ అందరూ కలసి చూసేలా శివ నిర్వాణ తీర్చిదిద్దిన విధానమే ఈ 150 కోట్ల హిస్టారిక్ సక్సెస్‌కు అసలైన కారణం. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.200 కోట్లకు చేరువై.. ఫుల్ రన్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.
[Irumudi Movie, Box Office, Collection, 150 Crores Gross, Ravi Teja, Shiva Nirvana, Telugu Cinema News, Telugu News, Tollywood]






