
సూపర్ స్టార్ రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ గా మరోసారి బాక్స్ ఆఫీస్ ని జీ హుజూర్ అనిపించడానికి వస్తున్నాడు. మరో వైపు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ని వెంటబెట్టుకొని పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' తో వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ఆసక్తిగా ఉండటం, డిఫరెంట్ జోనర్స్ కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక మూవీ లవర్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.సూపర్‌స్టార్ రజినీకాంత్ మాస్ మేనియా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో రూపుదిద్దుకున్న 'జైలర్ 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్-టైమ్ రికార్డు సృష్టించడంతో, ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్‌కు ఉన్న బలమైన మార్కెట్, బ్రాండ్ వాల్యూ ఈ సినిమాకు దసరా రేసులో అతిపెద్ద అడ్వాంటేజ్‌గా నిలుస్తోంది. మరోపక్క 'రణబాలి' చిత్రం కూడా అంతే ధీటుగా బజ్ క్రియేట్ చేస్తోంది. 1800ల కాలంలో బ్రిటిష్ పాలన, రాయలసీమ ప్రాంతంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. విజయ్ దేవరకొండ కేరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా రష్మిక కి ఉన్న గోల్డెన్ లెగ్ ఉపయోగపడుతుందనే మాటలు వినపడుతున్నాయి. . దసరా పండుగ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ పరంగా భారీ స్పందన లభించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'జైలర్ 2' వర్సెస్ 'రణబాలి' కలెక్షన్ల పోరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్, నెగెటివిటీ వస్తోంది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తీవ్రంగా ఆక్షేపించారు. తన సినిమా రిలీజ్ సమయంలో కావాలనే కొంతమంది పెయిడ్ ప్రోమోషన్లు, ట్రోలింగ్ బ్యాచ్‌లను పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతికూల కామెంట్లలో దాదాపు 90 శాతం మ్యానుఫ్యాక్చర్డ్ ట్రోలింగ్ అని, కావాలనే కొందరు రీల్స్ ద్వారా నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారని పక్కా డేటాతో ఘాటుగా వెల్లడించారు.

ఏదేమైనా 15 ,16 న రజినీకాంత్ మాస్ చిత్రం, ఇటు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ భారీ పీరియాడిక్ డ్రామా పోటీపడటం చిత్ర పరిశ్రమకి , ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. విభిన్న జానర్లలో వస్తున్న ఈ రెండు చిత్రాలలో ఏది బాక్సాఫీస్ దగ్గర దసరా విన్నర్‌గా నిలుస్తుందో, ఏ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. సినీ ప్రేమికులు, ట్రేడ్ సర్కిల్స్ లో అయితే ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ బరిలో ముందు వరుసలో నిలుస్తుందనే క్యూరియాసిటి ఏర్పడింది.
[Jailer 2 vs Ranabaali, Jailer 2 vs ranabaali box office clash, Jailer 2, Ranabaali, Vijay Deverakonda, Rajinikanth, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]




