
తలైవా రజినీకాంత్ ప్రస్తుతం థియేటర్స్ లో ముత్తువేల్ పాండియన్ గా థియేటర్స్ లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. అసలు రివ్యూ వచ్చే లోపు ట్విట్టర్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాని రజినీ అభిమానులు హోరెత్తిస్తున్నారు .
సినిమా మొదటి భాగం కథ ఎక్కడ ముగిసిందో, సరిగ్గా అక్కడి నుండే 'జైలర్ 2' ప్రారంభమవుతుంది. టైగర్ ముత్తువేల్ పాండియన్గా రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎంట్రీ సీన్ సూపర్. ప్రథమార్థంలో దర్శకుడు నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, యోగి బాబు కామెడీ అండ్ టీ స్టాల్ సీన్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. అయితే, కథనం కాస్త నిమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. బ్లాక్బస్టర్ ఇంటర్వెల్ మోమెంట్స్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. రజినీకాంత్ మాస్ ఎలివేషన్ సన్నివేశాలలో అనిరుధ్ BGM థియేటర్లను హోరెత్తిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, సర్ప్రైజ్ కామియోల గురించి ట్విట్టర్లో విశేషమైన చర్చ నడుస్తోంది. సినిమాలో ఇతర ముఖ్య తారలు మరియు కామియో రోల్స్ లో కనిపించిన నటుల ఎంట్రీలు ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్గా మారాయి.

ట్విట్టర్ రివ్యూల సమాహారాన్ని గమనిస్తే, దాదాపు 70 శాతం మంది నెటిజన్లు సినిమాపై సానుకూల (పాజిటివ్) స్పందనను వ్యక్తం చేస్తూ 4/5 రేటింగ్స్ ఇస్తున్నారు. కాగా, మిగిలిన 30 శాతం మంది కథనం కొన్ని చోట్ల స్లోగా సాగిందని, రొటీన్ ఫార్మాట్లా అనిపించిందని మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రజినీకాంత్ మేనరిజమ్స్, నెల్సన్ మార్క్ కామెడీ, అనిరుధ్ మ్యూజిక్ కలగలిసి 'జైలర్ 2'ని థియేటర్లలో పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయని మెజారిటీ నెటిజన్ల ప్రాథమిక టాక్.
Jailer 2 Twitter Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Movie Review, Jailer 2 Public Response, Nelson Dilipkumar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News






