
సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో తెరకెక్కిన 'జైలర్ 2' పాత రికార్డ్స్ కి సెండ్ ఆఫ్ చెప్పడానికి ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. జైలర్ కి సీక్వెల్ కావడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఉదయం నుంచే థియేటర్స్ వద్ద బారులు తీరారు. ప్రీ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇది రజిని కట్ అవుట్ అమ్మ అని మరో సారి చాటి చెప్పింది..
సాధారణ ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్న పబ్లిక్ టాక్ ప్రకారం 'జైలర్ 2' ఫస్ట్ హాఫ్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. దర్శకుడు నెల్సన్ తన మార్క్ డార్క్ హ్యూమర్, పవర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో మొదటి భాగాన్ని డిజైన్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా ఉంది. రజనీకాంత్ కామ్ అండ్ కంపోజ్డ్ స్వాగ్, సీరియస్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే మాస్ సీన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయని టాక్. కేరళ, తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన విజువల్స్ గ్రాండ్ కాన్వాస్‌ను గుర్తుచేస్తాయి. నటుడు యోగిబాబు కామెడీ టైమింగ్ కథనానికి కావలసినంత వినోదాన్ని అందిస్తూ నవ్వులు పూయించింది.
ఇది కూడా చదవండి: Jailer 2: జైలర్ ట్విట్టర్ రివ్యూ ఇదే!
సినిమాకు ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి ఎలివేషన్ సీన్‌ను ఆయన తన బీజీఎంతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతిలతో పాటు బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్లతో కూడిన భారీ క్యాస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రథమార్థంలో వచ్చే ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ థియేటర్లలో పేలుడు పుట్టించింది. 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ చేసింది.

ద్వితీయార్థం (సెకండ్ హాఫ్) లో కథ కొంత నెమ్మదించినప్పటికీ, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల చేత కేకలు వేయిస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ఘనమైన ఓపెనింగ్ వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోందని బాక్సాఫీస్ అంచనాలు చెబుతున్నాయి.
[Jailer 2 Public Talk, Jailer 2 Twitter Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Movie Review, Jailer 2 Public Response, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






