
కల్మషం లేని అభిమానం, ప్రేమ, కుటుంబ బంధాలకి విలువ ఇచ్చే నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తాడనే దర్శకుడిగా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో పరశురామ్ కి మంచి పేరు ఉంది. అయితే తన రూట్ మార్చి కమర్షియల్, మెసేజ్ ఫార్మేట్ తో మహేష్ బాబు తో 'సర్కారు వారి పాట' ని నింపి పర్వాలేదనిపించాడు.ఆ తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మాన్ అంతకంటే తక్కువ సిట్యువేషన్, తాజాగా సోషల్ మీడియాలో పరశురామ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది.
పరశురామ్ మాట్లాడుతు 'సోలో' విజయం తర్వాత ఇండస్ట్రీలో అందరూ త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ తర్వాత నువ్వే అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ అతి నమ్మకంతోనే మాస్ మహారాజా రవితేజతో 'సారొచ్చారు' తెరకెక్కించాను. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో పాటు భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ఆ సినిమా పరాజయంతో పొగిడిన వారందరూ ఒక్కసారిగా దూరం పెట్టారు. వాళ్ల మాటలు కూడా నన్ను చాలా బాధపెట్టాయి. దీంతో సారొచ్చారు ఫ్లాప్ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు ఏం చేయాలో తోచలేదు. ఆ కష్టకాలంలో నిర్మాత బన్నీ వాసు ఎంతో అండగా నిలిచారు. అప్పుడపుడు ఫోన్ మాట్లాడుతు దైర్యం చెప్పేవారు. అసలు బన్నీ వాసు నుంచి ఫోన్ వస్తే ఏదైనా కొత్త ఆఫర్ ఉంటుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూసేవాడిని. అనుకున్నట్లుగానే మూడేళ్ల తర్వాత బన్నీ వాసు ఫోన్ చేసి అల్లు అరవింద్ గారు నిన్ను కలవాలనుకుంటున్నారని చెప్పడంతో నాలో ఆశలు చిగురించాయి.
ఇది కూడా చదవండి: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్!

అల్లు అరవింద్ గారు నాతో అల్లు శిరీష్‌కి సోలో సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ తరహాలోనే ఒక మంచి సాఫ్ట్ లవ్ స్టోరీ చేయమని కోరారు. అంతేకాకుండా 10 లక్షల చెక్కు అడ్వాన్స్‌గా ఇచ్చి ఎడారిలో వర్షం కురిపించినంతటి ఉపశమనం కలిగించారు. అదే సమయంలో నాకు కొడుకు పుట్టాడు. దీంతో ఆపద సమయంలో అండగా నిలిచి లైఫ్ ఇచ్చిన అల్లు అరవింద్ గారిపై ఉన్న కృతజ్ఞతతో అందరూ ప్రేమగా పిలిచే 'అవ్యన్' అనే పేరుని నా కుమారుడికి పెట్టుకున్నట్లు పరశురామ్ తెలిపారు. గీతా ఆర్ట్స్ లో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లోనే విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన 'గీత గోవిందం' 100 కోట్లకి పైగా రాబట్టింది. మరి అల్లు అరవింద్ పేరు అరవింద్ కదా, పరశురామ్ కొడుకు పేరు అవ్యన్ కదా అనుకోవచ్చు. అల్లు అరవింద్ ని దగ్గర వాళ్ళు 'అవి' అని పిలుస్తుంటారు.
[Director Parasuram About Allu Aravind, Director Parasuram About Carir Struggles, Saroccharu movie, 10 lacs, Geetha Govindam, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




