సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ విడుదలకు ముందే కేరళలో సందడి మొదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటి షమ్నా కాసిం (పూర్ణ)కు తిరువనంతపురంలో భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ సినిమా విడుదల సందర్భంగా పూర్ణకు కూడా ఇలా ప్రత్యేక గుర్తింపు లభించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
నటి పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఆమె.. తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో కలిసి ‘ఆలా బోలెలో’ పాటలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటలో పూర్ణ సంప్రదాయ కేరళ చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఓనం పండుగ నేపథ్యంలో విడుదలైన ఈ పాటకు మలయాళీ టచ్ ఉండటం విశేషం.
మరోవైపు ‘జైలర్ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సీక్వెల్లో భాగమవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేరళలో రజనీకి ఉన్న క్రేజ్‌కు తోడు పూర్ణకు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
[Jailer 2, Shamna Kasim, Poorna Cutout, Rajinikanth Jailer 2, Thiruvananthapuram, Ala Bolelo Song, Jailer 2 Kerala Buzz]






