Home

»

Latest News

The Odyssey: 'ది ఒడిస్సీ' ఓటీటీ డేట్ వచ్చిందోచ్.. కానీ పరిస్థితి ఇదే!

Oct 14, 2026 6:23PM

 

ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్ మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్  ప్రతిష్టాత్మక విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) డిజిటల్ స్ట్రీమింగ్‌కి రంగం సిద్ధమైంది.  

నవంబర్ 17న అడుగుపెట్టబోతున్నట్టు అధికార ప్రకటన చేసారు.కాకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ప్రముఖ వేదికలలో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్  విధానంలో, రెంట్ లేదా బై పద్ధతిలో అందుబాటులో ఉండనుంది. ఇక డిజిటల్ ప్రీమియర్‌తో పాటు మూవీకి సంబంధించిన మరో అదిరిపోయే అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. డిజిటల్ వెర్షన్‌తో పాటు 4K ఆల్ట్రా హెచ్‌డీ, బ్లూ-రే ఫార్మాట్లలో దాదాపు 90 నిమిషాల ఎక్స్‌ట్రా బోనస్ ఫుటేజ్ (మేకింగ్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్) కూడా విడుదల కానుండటం విశేషం. సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను మరింత లోతుగా తెలుసుకోవాలనుకునే సినీ అభిమానులకు ఇది నిజంగానే కనువిందని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ సంచలన స్పీచ్: ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా!

 

క్రిస్టోఫర్ నోలన్ ట్రేడ్‌మార్క్ ఐమ్యాక్స్ (IMAX) విజువల్స్, లుడ్విగ్‌ గోరాన్సన్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు హోయ్టే వాన్‌ హోయ్టెమా సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం నవంబర్ 17 నుంచి చిన్న స్క్రీన్‌లపై కూడా నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది. మరి లేటు చేయకండా  ఒడిస్సీ చేసేసి ఎంజాయ్ చేయండి.

 

[The Odyssey Ott Release Date, The Odyssey OTT release date, Christopher Nolan Odyssey, The Odyssey digital premiere, Amazon Prime Video India, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com