Home

»

Latest News

రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ సంచలన స్పీచ్: ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా!

Oct 14, 2026 5:46PM

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా వచ్చిన చిత్రం 'రాధే శ్యామ్'. ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ గా ఉండిపోయింది. ప్రభాస్ క్యారక్టర్ డిజైన్ ని పూజాహెగ్డే కి, పూజా హెగ్డే క్యారక్టర్ డిజైన్ ని ప్రభాస్ కి సెట్ చేసి ఉంటే  రాధేశ్యామ్ ఫలితం బెటర్ పొజిషన్ లో ఉండేదనే మాటలు అభిమానులు, సినీ ప్రేమికుల్లో నుంచి వినిపించాయి. రాధే శ్యామ్ కి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.


చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చాడు.  'డోంట్ స్లీప్' టీజర్ లాంచ్ కార్యక్రమంలో రాధా కృష్ణ మాట్లాడుతూ డోంట్ స్లీప్ దర్శకుడు 22 ఏళ్లుగా నా ఫ్రెండ్. స్నేహితుడే కాదు నా మెంటర్, సోదరుడు లాంటి వ్యక్తి. డోంట్ స్లీప్ ని ఎలా తెరకెక్కించారో తెలిసి ఆశ్చర్యపోయాను. తక్కువ సమయంలోనే ఒక సినిమాని ఎలా పూర్తి చెయ్యాలో మనమందరం నేర్చుకోవాలని చెప్పాడు. 


ఇది కూడా చదవండి: సినిమా చూస్తు ఆ పని చేస్తున్నవ్యక్తి: సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

 

ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటించారు. 1970ల నాటి యూరప్ నేపథ్యంలో సాగే ఈ విజువల్ వండర్ లవ్ స్టోరీ కోసం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పడిన తపన, ఆయన తీసుకున్న కేర్ సినిమా మేకింగ్‌లో స్పష్టంగా కనిపించింది. మొదటి సినిమా 'జిల్'తోనే తన టేకింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన రాధాకృష్ణ రెండో సినిమా గండాన్ని దాటలేకపోయాడు. 2022 లో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యింది.

 

 

[RadhaKrishna Kumar about Radhe Shyam Movie, Radha Krishna Kumar Speech In dont Sleep Movie, Radhe Shyam Director, Dont Sleep Teaser, Tollywood Cinema News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com