
విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి ట్రేడ్ వర్గాలని సైతం విస్తుపోయేలా చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 125.25 కోట్ల గ్రాస్ మార్కుని చేరుకుని రికార్డు సృష్టించగా, అందులో అత్యధికంగా తమిళ వర్షన్ అత్యధికంగా 3.35 కోట్ల నెట్ రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో 12.50 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. హిందీ మార్కెట్లోనూ మొదటి రోజే 3.50 కోట్లు రాబట్టి పాన్-ఇండియా స్థాయిలో గట్టి పునాది వేసుకుంది.
రెండో రోజైన శుక్రవారం వర్కింగ్ డే అయినప్పటికీ, థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కడా తగ్గలేదు. శుక్రవారం నాడు ఇండియాలో 35.60 కోట్ల నెట్ వసూలు చేసి, దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లను 95.30 కోట్లకు చేర్చింది. ఇండియా గ్రాస్ ప్రాతిపదికన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 112.10 కోట్లను దాటిపోయింది. విదేశీ మార్కెట్లలోనూ రజినీ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఓవర్సీస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన గ్రాస్ కలెక్షన్లు ఏకంగా 97 కోట్లకు చేరి, ఓవర్సీస్లోనూ సరికొత్త రికార్డు నమోదు వైపు దూసుకుపోతోంది. రెండో రోజు తమిళ ప్రాంతాల్లో సగటు ఆక్యుపెన్సీ 61 శాతంగా నమోదు కాగా, రాత్రి షోలకు ఏకంగా 85.92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు వెర్షన్ కూడా ఏమాత్రం తగ్గకుండా 54.3 శాతం ఆక్యుపెన్సీతో 7.25 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో నైట్ షోలకు 73.64 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.
ఇది కూడా చదవండి: వాళ్ళని మాత్రం దాక్కున్నా వదిలిపెట్టను: చిరుత హీరోయిన్ పోస్ట్ వైరల్
.webp)
ఆంధ్రా, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో కలిపి గ్రాస్ కలెక్షన్లు 22 కోట్లకు చేరాయి. ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో 20.50 కోట్లు, కేరళలో20 కోట్లు రాబట్టి దక్షిణాది అంతటా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరి వీకెండ్ లో తన ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
[Jailer 2 Collections, Jailer 2 Two Days Collections, Jailer 2, Rajinikanth Jailer 2 Collections, Jailer 2 Day 2 Collection, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]






