
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేత ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే(చిరుత) అని చిందేయించిన భామ నేహా శర్మ. తాజాగా నేహా శర్మ డీప్‌ఫేక్ బారిన పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె మండిపడుతున్నారు.
నా అనుమతి లేనిదే నా ముఖాన్ని, వ్యక్తిత్వాన్ని పోలిన చిత్రాలని ఏఐ (AI) సాయంతో సృష్టించడం చట్టవిరుద్ధం. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు రూపొందించడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తక్షణమే ఆ కంటెంట్‌ని డిలీట్ చేయండి, ఇది నా నుంచి వస్తున్న అధికారిక హెచ్చరిక" అంటూ ఆమె తన పోస్టులో చాలా గట్టిగా పేర్కొన్నారు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, ఫేక్ అకౌంట్ల ముసుగులో దాక్కుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే ఎవరినీ చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నకిలీ ఖాతాల వెనుక దాక్కున్నంత మాత్రానా చట్టం నుంచి, కఠిన శిక్షల నుంచి తప్పించుకోలేరు. ఏఐ టెక్నాలజీ లేదా నకిలీ ఖాతాలు మిమ్మల్ని రక్షించలేవు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: అజయ్ దేవ్‌గణ్ కి షాక్.. ఆ అక్రమ నిర్మాణాలు కూల్చివేత!
.webp)
సాంకేతికత విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సైబర్ నేరాలు కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సృష్టిస్తున్న 'డీప్‌ఫేక్' (Deepfake) వీడియోలు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
[Neha Sharma Deepfake Warning, Neha Sharma, Deepfake videos, Neha Sharma warning, AI generated content, Cyber crime India, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]






