Home

»

Latest News

ఆ హీరోతో పిచ్చిగా ప్రేమలో ఉన్నా: మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు వైరల్! 

Oct 17, 2026 5:46PM


షార్ట్ పీరియడ్ లోనే అభిమానుల హార్ట్ బీట్ గా మారిన భామ మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుందనుకుంటే నయా ఇంటర్వ్యూ తో పిడుగు లాంటి వార్త చెప్పింది. 

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు షారుఖ్ ఖాన్ తన సినిమాల్లో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు, ఆయన సృష్టించిన బెంచ్‌మార్క్‌లు నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. సినిమా రంగంలో రొమాన్స్ పరంగా షారుఖ్ ఖాన్ సెట్ చేసిన ప్రమాణాలు మరెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయి. వెండితెరపై ఆయన ప్రదర్శించిన అద్భుతమైన హావభావాలు, ప్రేమను వ్యక్తపరిచిన తీరు చూశాక, నా జీవితంలో షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి లేకపోవడం  ఎంతో బాధిస్తోంది. 

 ఆ వెలితి నా హృదయాన్ని ముక్కలు చేస్తోందని మృణాల్ భావోద్వేగంగా వెల్లడించారు నిజ జీవితంలో అలాంటి భాగస్వామి దొరకడం కష్టమని ఆమె అన్నారు. "షారుఖ్ సర్ నా జీవితంలో లేకపోవడం నా గుండెను పగిలిపోయేలా చేస్తోంది. అయన అంటే పిచ్చి ప్రేమ. షారుక్ సర్ లా రొమాంటిక్ గా ఉండే వ్యక్తిని కలవలేదు. ఆయన సృష్టించిన స్టాండर्डస్ గురించి ఎంత చెప్పినా తక్కువే" అని మృణాల్ పేర్కొన్నారు. 

 ఇది కూడా చదవండి: కలెక్షన్ల సునామీ: రెండు రోజులకి తెలుగులో ఎంతంటే!

 


ఈ తరం సినిమాల్లో ప్రేమ కథలపై మాట్లాడిన ఆమె, పాత కాలపు చిత్రాలను తిరిగి చూసినప్పుడు కొన్ని విషయాలపై భిన్నమైన ఆలోచనలు వస్తాయని, అయితే అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం లేకుండా కేవలం వినోదం కోసం మాత్రమే సినిమాలు ఉండేవని గుర్తుచేశారు. ఒక మహిళా నటిగా నాకు నచ్చిన జోనర్‌, క్యారక్టర్ ఎంచుకునే స్వేచ్ఛ ఈ ఆధునిక కాలంలో లభించడం చాలా సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

 

Mrunal Thakur About shah Rukh Khan, Mrunal Thakur Latest Interview, Shah Rukh Khan, SRK romance standard, Mrunal Thakur news, Bollywood updates, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com