ఇదేమి ముచ్చటో: వర్కర్స్ భోజనం మీద జగపతిబాబు దాడి.!
Nov 27, 2026 11:18AM

వెండితెరపై గంభీరమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించే నటుడు జగపతిబాబు.. నిజ జీవితంలో మాత్రం చాలా సరదాగా ఉంటారు. స్టార్‌డమ్, హోదా లాంటివి పక్కనపెట్టి అందరితో కలిసిపోయే ఆయన తీరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా వర్కర్స్‌తో కలిసి భోజనం చేస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు.
సాధారణంగా సినిమా షూటింగ్‌లలో నటీనటులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ల కోసం ప్రత్యేకంగా భోజనం సిద్ధం చేస్తుంటారు. కానీ జగపతిబాబు మాత్రం అక్కడ పనిచేసే వర్కర్స్ భోజనాన్ని ఆస్వాదించారు. వాళ్ల భోజనంలో ఉన్న కూర, అన్నం చూసి తనకూ తినాలనిపించిందని సరదాగా చెప్పుకొచ్చారు.
ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న జగపతిబాబు.. “బ్రేకింగ్ న్యూస్.. జంటకి ఒక కూర, నాలుగు ముద్దల అన్నం తిని రోజంతా పని చేస్తుంటే.. నోరూరి వాళ్ల భోజనం మీద దాడి చేశాడు జగ్గు భాయ్” అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. తనను తానే ఆటపట్టించుకుంటూ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

జగపతిబాబు వర్కర్స్ తెచ్చుకున్న భోజనాన్ని ఇష్టంగా తినడమే కాకుండా.. వాళ్ళ కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా బిర్యానీతో పాటు పలు వంటకాలు తెప్పించారు.
ఇది కూడా చదవండి: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్.. నితిన్ కమ్‌బ్యాక్ ఇస్తాడా.?
సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించే జగపతిబాబు.. ఇలా సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి భోజనం చేయడం అభిమానులకు నచ్చుతోంది. ముఖ్యంగా తన చుట్టూ పనిచేసే వాళ్లతో ఎలాంటి భేషజాలు లేకుండా కలిసిపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన రోజువారీ జీవితంలో జరిగే సరదా సంఘటనలు, ఫుడ్ వీడియోలు, ఫన్నీ పోస్టులతో అభిమానులను అలరిస్తుంటారు. ఇప్పుడు వర్కర్స్ భోజనం మీద జగ్గు భాయ్ చేసిన ‘దాడి’ అందరినీ నవ్విస్తోంది. స్టార్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. ఇలాంటి చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడం ఆయనకు అలవాటు. అందుకే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చవచ్చు:
జపాన్‌లో ‘లెనిన్’ రిలీజ్.. ఆ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.?
14 ఏళ్ళ తర్వాత నాగార్జున రికార్డుకు ఎసరు.!
[Jagapathi Babu, Twitter, Viral Video, Food, Workers]



