TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

జపాన్‌లో ‘లెనిన్’ రిలీజ్.. ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.?

Nov 26, 2026 4:30PM

అఖిల్ అక్కినేనికి మంచి విజయాన్ని అందించిన ‘లెనిన్’ సినిమా ఇప్పుడు మరో దేశంలో ప్రేక్షకులను పలకరించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 11న అక్కడ థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అంతేకాదు, సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో జపాన్‌లో ‘లెనిన్’ను ఏ స్థాయిలో విడుదల చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది.

అఖిల్ కెరీర్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని ‘లెనిన్’ అందించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. అఖిల్‌ను కొత్తగా చూపించడంతో పాటు, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ప్రమోద్ పంజు, శివాజీ, ఈశ్వరీ రావు, సునీల్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి హింట్.!

ఇక జపాన్‌లో తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు కూడా జపాన్ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ ‘లెనిన్’ కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి అఖిల్‌కు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘లెనిన్’ ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. డిసెంబర్ 11న విడుదలయ్యే ఈ సినిమా అక్కడ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ బ్యాన్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక సూచన.!
‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్ జోరు.. వారం రోజుల్లోనే 50 కోట్లు.!

 

 

 

[Akhil Akkineni, Lenin Movie, Japan Release, Bhagyashri Borse, Murali Kishor Abburu]

 

google-ad-img