Home

»

Latest News

మూడు రోజులకి ఎంతంటే!

Aug 24, 2026 11:42AM

 

 

మంచి కంటెంట్ ఇచ్చి కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అన్నటుగా ఉంది ఇరుముడి కలెక్షన్స్ పరిస్థితి. మొన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఇరుముడి ఆ ఏరియా ఈ ఏరియా అని కాదు వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది. 


మూడు రోజులకి 80 కోట్ల రికార్డు మార్కుని అందుకొని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మేకర్స్ కూడా కలెక్షన్స్ పై అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో మాస్ మహారాజా అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 200 కోట్ల మార్కుని అందుకుంటామని నెట్టింట హంగామా చేస్తున్నారు. ఇరుముడి వేగాన్ని చూస్తే 200 కోట్లు పెద్ద కష్టమేమి కాదనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో సైతం వినిపిస్తున్నాయి.

Also Read: చిరంజీవి బర్త్ డే రోజు రిలీజైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా!

 తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగమైన అనుబంధానికి,  అయ్యప్ప దీక్షా నేపథ్యం కలవడంతో ప్రేక్షకుల హృదయాలను తాకడంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. చాలా సినిమాల తర్వాత  రేపు ఇరుముడి మూవీకి వెళ్లాలని  ముందురోజే  ప్రేక్షకులు ప్రిపేర్ అయ్యి తమ రోజువారీ టైం టేబుల్ వేసుకుంటున్నారంటే ఇరుముడికి యొక్క ప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు.   మైత్రీ మూవీ మేకర్స్,  టి సిరీస్ సంయుక్తంగా నిర్మించగా బంగాళా ఖాతంలో ఎన్ని వాయుగుండాలుపడినా ఇరుముడి థియేటర్స్ మాత్రం అభిమానులు, ప్రేక్షకులతో కళకళలాడటం ఖాయం. అందుకు హైదరాబాద్ లో  నిన్న ఆదివారం కురిసిన భారీ వర్షాలే ఉదాహరణ. 

 Irumudi, Raviteja, Shiva Nirvana, PriyaBhavani Shankar, Nakshtra

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com