Home

»

Latest News

యాభై భాషల్లో వారణాసి!

Aug 24, 2026 12:16PM

 

ఇండియన్ సినిమా వైపు ప్రపంచ సినిమా చూడాలనే లక్ష్యంగా 'వారణాసి' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసం మహేష్, రాజమౌళితో పాటు టీం మొత్తం అహర్నిశలు శ్రమిస్తోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 120కి పైగా దేశాల్లో విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ విజువల్ వండర్ కి  సంబంధించి తాజాగా ఒక సంచలనాత్మక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  


భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వారణాసిని  50కి పైగా  భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇన్ని భాషల్లో డబ్బింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ వాయిస్ క్లోనింగ్ సాంకేతికతపై ఆధారపడటం సులభమైన మార్గం. అయితే, సినిమాలోని  ఎమోషన్ 'ఏఐ' ద్వారా రాదని, దాదాపు 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో ఆయా భాషల డబ్బింగ్ ప్రక్రియని  నిర్వహించేందుకు జక్కన్న  పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ సుదీర్ఘ డబ్బింగ్ ప్రాసెస్ కోసం ఆయా భాషలకు సంబంధించిన స్థానిక ఉచ్చారణ, నిర్దిష్టమైన యాస మరియు సంస్కృతికి తగినట్లుగా డైలాగ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటీనటుల తెరపై కనబరిచే హావభావాలు, నటనలోని అసలైన భావోద్వేగాలు ఏ భాషలో చూసినా ప్రేక్షకులకు ఎంతో సహజంగా అనిపించేలా ప్రతి పాత్రకూ వాయిస్ టెస్టులు చేసి ప్రత్యేకంగా డబ్బింగ్ రికార్డ్ చేయిస్తున్నారు. 1600 మంది కళాకారుల విభిన్న గొంతులతో 50 భాషల్లో ఒకే చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రాసెస్ చేయడం గ్లోబల్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది.   

 

Also Read: మూడు రోజులకి ఎంతంటే!

వారణాసి కథ విషయానికి వస్తే, ఇది కేవలం సాధారణ అడ్వెంచర్ మాత్రమే కాదు.   భూమిని ఢీకొట్టేందుకు అత్యంత వేగంగా దూసుకొస్తున్న ఒక భారీ ఉల్క వల్ల ఏర్పడే సర్వనాశనం ప్రమాదం నుండి పవిత్ర నగరం వారణాసితో పాటు మొత్తం ప్రపంచాన్ని కాపాడే ఒక ఉత్కంఠభరితమైన మిషన్‌గా ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తుండగా, కథాంశంలో భాగంగా ఆయన వివిధ కాలాల మధ్య టైమ్ ట్రావెల్ చేసేలా అత్యుత్తమ స్క్రీన్ ప్లేని రాజమౌళి తీర్చిదిద్దారు. భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన పురాణ వైభవం మరియు ఆధునిక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్లను మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ ఉంది. 1400 కోట్ల భారీ బడ్జెట్ తో కె ఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్.

Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com