Home

»

Latest News

జయరామ్, సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా?.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు.!

Aug 24, 2026 11:36AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జయరామ్, సిమ్రాన్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు, మెడలో పూలదండలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసి.. జయరామ్, సిమ్రాన్‌ పెళ్లి చేసుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

సీనియర్ యాక్టర్స్ ఉన్నట్టుండి ఇలా పెళ్లి బట్టల్లో కనిపించేసరికి అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే మరింత షాక్ అవ్వడం గ్యారెంటీ.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు నిజమే. వారి మెడలో పూలదండలు ఉన్న మాట కూడా వాస్తవమే. కానీ, వారు పెళ్లి చేసుకోలేదు. వైరల్ అవుతున్న ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు కారణం.. ఒక కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం.

ఇటీవల ప్రారంభమైన ఒక కొత్త మూవీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా, సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న జయరామ్, సిమ్రాన్‌ కు నిర్వాహకులు పూలదండలు వేసి సత్కరించారు. అక్కడ తీసిన ఫోటోలనే కొందరు పెళ్లి ఫోటోలు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో నిజంగానే వీరిద్దరికి పెళ్లయిందని చాలామంది నెటిజెన్లు భ్రమపడ్డారు.

మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం ఎంత కష్టమైపోయిందో దీని ద్వారా మరోసారి అర్థమవుతోంది.

 

 

 

Jayaram, Simran, Viral Photos

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com