Home

»

Latest News

ఒరిజినల్:  ఇరుముడి పదిరోజుల కలెక్షన్స్ ఇవే 

Aug 31, 2026 11:57AM

 

సినిమా మీద అభిమానంతో నలభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన మాస్ మహారాజా సినీ జన్మ 'ఇరుముడి'తో ధన్యమైనట్టే. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా వన్ వీక్ కి వీక్ అవుతున్న ప్రస్తుత రోజుల్లో నిన్న తెనాలి పక్కన 'సి' టౌన్(సినీ భాషలో) గా పరిగణించే దుగ్గిరాలలో ఇరుముడి చూడటం కోసం దుగ్గిరాల చుట్టూ పక్కల గ్రామాల మహిళలు ట్రాక్టర్లలో భోజనం కట్టుకొని మరి వచ్చారంటే ఇరుముడి ప్రేక్షక సునామీని అర్ధం చేసుకోవచ్చు. మరి రవితేజ సినీ జన్మ ధన్యమైనట్టే అని చెప్పుకోవడంలో ఈసమంతైన అతిశయోక్తి లేదు.


 నిన్న 10వ రోజు ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ గా 170.95 కోట్ల గ్రాస్ వసూళ్లని  రాబట్టి  సంచలనం సృష్టించింది. 170 కోట్లు అని చెప్పినా 200 కోట్లు వచ్చి ఉంటాయని ప్రేక్షకులే చెప్పే పరిస్థితి. దీన్ని బట్టి ఇరుముడి కలెక్షన్స్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో చెప్పలేని పరిస్థితి. వినాయకచవితి మూడ్  కూడా కలిసి ఉండటం ఇరుముడి చేసుకున్న అదృష్టం.  

Also Read: ఊహించని దర్శకుడు: యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా!


డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్స్ కి ఇప్పటికే మూడు వంతుల లాభాలు అందించిన ఇరుముడి ఓన్లీ  నైజాం ఒక్క రీజియన్‌లోనే 70 కోట్ల వరకు వసూలు చేసి  100 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి ఉవ్వళ్ళూరుతుండటం కొసమెరుపు.

 

 

[Irumudi, Raviteja, Nakshthra, Shiva Nirvana, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com