Home

»

Latest News

డప్పు శ్రీను,డబ్బు శ్రీనుగా మారిపోయాడు: మల్లెపూల పల్లకికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే!

Aug 31, 2026 12:44PM


'ఇరుముడి' మూవీ భారీ సక్సెస్ సెకండ్ హాఫ్ లో వచ్చే అయ్యప్పస్వామి గీతం "మల్లెపూల పల్లకి" కి కూడా  దక్కుతుందనే విషయం తెలిసిందే. సెకండ్ టైం కూడా ప్లే చేయాల్సిందే అని ప్రేక్షకులు స్క్రీన్ ముందు డిమాండ్ చేసి మరి అడుగుతున్నారంటే మల్లెపూల పల్లకి వాళ్ళని ఎంతలా మెస్మరైజ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. సాంగ్ వస్తున్నప్పుడు  అయ్యప్పస్వామి భక్తులతే బంగారుపళ్లెంలో కర్పూర హారతులు ఇస్తున్నారు.


ఈ సాంగ్ రాసింది ప్రముఖ సింగర్, చౌడం శ్రీనివాస్. అయ్యప్పస్వామి భక్తుడు, జానపద గాయకుడు  'డప్పు శ్రీను' ఆలపించాడు. సాధారణంగా జానపద కళాకారులకు చిత్రసీమలో లభించే గుర్తింపు, పారితోషికంపై ఎన్నో అపోహలు ఉండేవి. అయితే ఈ పాట విజయం తర్వాత డప్పు శ్రీను అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క పాట పాడినందుకు గానూ మైత్రి మూవీ మేకర్స్  9 లక్షల భారీ పారితోషికాన్ని అందించారని వార్తలు వెలువడటంతో సినీ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక జానపద గాయకుడి ప్రతిభకు దక్కిన సరైన గౌరవంగా సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. 

ఒరిజినల్:  ఇరుముడి పదిరోజుల కలెక్షన్స్ ఇవే 


మల్లెపూల పల్లకి  విడుదలైన అతి తక్కువ సమయంలోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానాన నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, భక్తి సంబంధిత వీడియోల్లో ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా విపరీతంగా మారడంతో వ్యూస్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. . జి.వి. ప్రకాష్ రీ క్రియేషన్ చేసిన తీరు, డప్పు శ్రీను పాడిన శక్తివంతమైన తీరు శ్రోతలలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఏది ఏమైనా ఇన్నిరోజులు ప్రైవేట్ గీతంగా కోట్లాది మందిని అలరించిన 'మల్లెపూల పల్లకి' సినీ పాటగా కూడా ఆవిర్భవించి  మేకర్స్ కి కోట్లరూపాయలని అందిస్తుండటం గొప్ప విషయం.  

 

[Irumudi, Dappu Srinu, MallePoola Pallaki,  Remunaration, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com