TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో భార‌త్‌కు నిరాశ‌.. విజేత‌లు ఎవ‌రంటే.?

Nov 24, 2026 1:19PM

న్యూయార్క్‌లో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈసారి మన దేశం నుంచి రెండు ఎంట్రీలు పోటీలో నిలిచాయి. ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ నటించిన నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ ‘వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్’, సోనీ లివ్‌లో వచ్చిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ సిరీస్‌ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. అయితే ఈ రెండింటికీ పురస్కారాలు దక్కలేదు.

కామెడీ విభాగంలో వీర్ దాస్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఆయన ‘ఫూల్ వాల్యూమ్’కు బదులుగా అర్జెంటీనాకు చెందిన ‘డివిజన్ పాలెర్మో – సీజన్ 2’ ఉత్తమ కామెడీ సిరీస్ అవార్డును గెలుచుకుంది. 2023లో ‘వీర్ దాస్: ల్యాండింగ్’తో ఎమ్మీ అవార్డును అందుకున్న వీర్ దాస్‌కు ఇది మూడో నామినేషన్.

ఇక ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ పోటీ పడింది. మానవ్ కౌల్, మహమ్మద్ జీషన్ అయ్యుబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌.. ఫ్రాన్స్‌కు చెందిన ‘కారేమ్’తో పోటీలో నిలిచింది. చివరకు ‘కారేమ్’ ఉత్తమ డ్రామా సిరీస్‌గా అవార్డును సొంతం చేసుకుంది. రాజేష్ మాపుస్కర్, మహేష్ మథాయ్ దర్శకత్వం వహించిన ‘రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ నిజ జీవితంలోని ఫుట్‌బాల్ క్లబ్ ప్రయాణం ఆధారంగా రూపొందింది.

ఇది కూడా చదవండి: ఇరాన్ గాయని, ఆమె బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష.. అసలేం జరిగింది.!

ఈ ఏడాది ఎమ్మీ అవార్డుల్లో బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రొడక్షన్స్‌ ఎక్కువ పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా ‘అన్‌ఫర్గివబుల్’లో నటించిన బాబీ స్కోఫీల్డ్, ఉత్తమ నటిగా ‘హోలీ షిట్’లో నటించిన మోనా మినా లియోన్‌ ఎంపికయ్యారు. ఉత్తమ టీవీ మూవీ/మినీ సిరీస్‌గా ‘ప్రిజనర్ 951’, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘లూయిస్ థెరౌక్స్: ది సెటిలర్స్’ నిలిచాయి.

ఉత్తమ డ్రామా సిరీస్: Carême – ఫ్రాన్స్

ఉత్తమ కామెడీ సిరీస్: División Palermo – Season 2 – అర్జెంటీనా

ఉత్తమ నటుడు: Bobby Schofield – Unforgivable – బ్రిటన్

ఉత్తమ నటి: Mona Mina Leon – Holy Sh!t – బెల్జియం

ఉత్తమ టీవీ మూవీ/మినీ సిరీస్: Prisoner 951 – బ్రిటన్

ఉత్తమ డాక్యుమెంటరీ: Louis Theroux: The Settlers – బ్రిటన్

ఉత్తమ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్: Der Talentierte Mr. F – జర్మనీ

ఉత్తమ కరెంట్ అఫైర్స్: Exposure: Breaking Ranks: Inside Israel’s War – బ్రిటన్

ఉత్తమ వార్తా కార్యక్రమం: The World: 24 Hours in the Kill Zone – బ్రిటన్

ఉత్తమ నాన్-స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్: Educating Yorkshire – Season 2 – బ్రిటన్

ఉత్తమ షార్ట్-ఫార్మ్ సిరీస్: De Klas van 2000 – బెల్జియం

ఉత్తమ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ: The Philipstown Wirecar Grand Prix – దక్షిణాఫ్రికా

ఉత్తమ టెలినోవెలా: Leyla – టర్కీ

పిల్లల యానిమేషన్: The Scarecrows’ Wedding – బ్రిటన్

పిల్లల ఫ్యాక్చువల్/ఎంటర్‌టైన్‌మెంట్: Horrible Science – బ్రిటన్

పిల్లల లైవ్-యాక్షన్: Dexter Procter the Ten-Year-Old Doctor – బ్రిటన్

మీకు నచ్చవచ్చు:

ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార ‘మహాశక్తి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.

పెద్దిపై శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు: జాన్వీ వివాదంపై ఎవరి తరఫు మాట్లాడిందో తెలుసా?  

 

 

 

[InternationalEmmyAwards2026, 54thInternationalEmmyAwards, VirDas, RealKashmirFootballClub]

google-ad-img