TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

డింపుల్‌ హయాతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్ గా అందరకి అర్థమైంది!

Nov 24, 2026 1:32PM


హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో మెరిసే ముద్దుగుమ్మగా అభిమానులని, సినీ ప్రియులని తన చూపులతో కట్టేసే భామ డింపుల్‌ హయాతి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో 'నారాయణమ్మ' సాంగ్ తో తన బాధ చెప్పుకుంది. ఈ నెల 27 న శర్వానంద్ తో కలిసి 'భోగి' తో హీరోయిన్ గా పలకరించనుంది.  


భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మందారం రంగు చీరలో  హాజరైన డింపుల్ తన అందంతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇదే క్రమంలో హీరో శర్వానంద్‌తో మరింత క్లోజ్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

వీటిని చూసిన ఓ నెటిజన్‌.. డింపుల్‌కు కూడా పెళ్లయిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. దీనికి హీరోయిన్ డింపుల్ హయాతి కూడా వెంటనే స్పందించింది. ‘ఐ యామ్ నాట్ మ్యారీడ్ అంటూ రిప్లై ఇచ్చింది. తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ డింపుల్‌ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శర్వానంద్‌తో కాస్తా క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయిందా అని అడుగుతారా అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 కాగా డింపుల్ కు పెళ్లయిపోయిందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.అయితే మొత్తానికి ప్రస్తుతానికి తాను సింగిల్‌ అని మాత్రం డింపుల్ క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే డింపుల్ గతంలో  ఒక అపార్ట్ మెంట్ లో  తనకి క్లోజ్ గా ఉన్న వ్యక్తితో కలిసి మరొకరితో గొడవపడుతున్న వీడియోని కూడా పనిలో పనిగా కొంత మంది షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: చిరు పేరులో N  ఎందుకు లేదో ప్రోమో రిలీజ్ చేసారు: ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

‘భోగి’ చిత్రంలో డింపుల్ హయాతి ‘మందారం’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇప్పటివరకు తనపై ఉన్న గ్లామర్ ఇమేజ్‌ను ఈ సినిమా పూర్తిగా మార్చేస్తుందని డింపుల్ చెబుతోంది.


రిలీజ్ కి  అన్ని హంగులు పూర్తి చేసుకున్న భోగి ఈ శుక్రవారం ఏ మేర  థియేటర్లలో సందడి చేస్తుందో చూడాలి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కి  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.      

 

మీకు నచ్చవచ్చు: అడవి శేష్ సరసన ఆ క్రేజీ  హీరోయిన్  

                             ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఎగిరి గంతేయ్యడం ఖాయం!

 

[Dimple Hayathi, Bhogi, Sharwanadh, Tollywood, Anupama Parameswaran]

google-ad-img