Home

»

Latest News

I'M Game Movie Review in Telugu: ఐ యామ్ గేమ్ మూవీ రివ్యూ

Sep 3, 2026 4:55PM

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, కదిర్

సాంకేతిక బృందం:
స్క్రీన్ ప్లే: ఇస్మాయిల్ అబూబకర్, సంజీర్ బాబా, బిలాల్ మొయిదు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్
ఎడిటింగ్: చమన్ చాకో
దర్శకత్వం: నహాస్ హిదాయత్
నిర్మాతలు: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్

తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) కు మంచి క్రేజ్ ఉంది. 'కింగ్ ఆఫ్ కోత' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన, ఎట్టకేలకు ఐ యామ్ గేమ్ (I'M Game)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు వాయిదాల తర్వాత ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి 'RDX' ఫేమ్ నహాస్ హిదాయత్ (Nahas Hidayath) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) గ్యాంబ్లింగ్‌కు బానిస. అందరూ అతన్ని 'లూజర్' అని పిలుస్తుంటారు, అతని తండ్రి కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. అప్పుల నుంచి బయటపడేయడానికి అతని తల్లి (Jayasudha) తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని ఇస్తుంది. కానీ అతను ఆ డబ్బును కూడా సీపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందెం కాసి, ఏకంగా రూ. 2 కోట్ల అప్పుల్లో కూరుకుపోతాడు. ఆ బెట్టింగ్ గ్యాంగ్స్టర్‌ను బెదిరించబోయి, ఒక ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోతాడు.

దాత విక్కీ (Anthony Varghese) చేతిని డాన్‌కు అమరుస్తారు. అయితే ఆ కొత్త చేయి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ, డాన్ జీవనశైలిని మార్చేలా చేస్తుంది. దాని ప్రభావం నుంచి డాన్ బయటపడలేకపోతాడు. ఆ చేతి ప్రభావంతోనే డాన్, డేవిడ్ (Mysskin) అనే గ్యాంగ్స్టర్‌ను వెంటాడతాడు. అసలు విక్కీకి, డేవిడ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్తి నిజం తెలుసుకున్న తర్వాత డాన్ ఏం చేశాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

యాక్షన్ సన్నివేశాల్లో దుల్కర్ సల్మాన్ నటన బాగుంది. తెరపై అతని ప్రెజెన్స్ వల్ల సీన్స్ అన్నీ సహజంగా అనిపిస్తాయి. చాలా సన్నివేశాల్లో అతని ఛార్మ్ ఆకట్టుకున్నా, కొన్నిచోట్ల యాక్షన్ సీన్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. కాయదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కదిర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ తమ పాత్రల పరిధి మేర నటించారు, కానీ ఎవరూ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కదిర్ పాత్రను ఇంకాస్త మెరుగ్గా రాసుకోవాల్సింది.

దర్శకుడు నహాస్ హిదాయత్ మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలతో దాన్ని కేవలం యాక్షన్ కోసమే వాడుకున్నట్లు అనిపిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ ట్రాక్, ఆ తర్వాత వచ్చే ఫైట్ బాగా డిజైన్ చేసినా... ఆ తర్వాత స్క్రీన్ ప్లే సాధారణంగానే సాగుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు కథ బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దుల్కర్ తన నటనతో సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన మంచి కిక్ సెకండ్ హాఫ్‌లో మిస్ అవుతుంది. యాక్షన్ ఎక్కువున్న ద్వితీయార్థం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మారిపోయింది.

టెక్నికల్ గా జేక్స్ బిజోయ్ సంగీతం, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. కానీ ఎడిటింగ్ కొన్ని చోట్ల అతుకులు అతికించినట్లుగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, మంచి కథాంశం ఉన్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని తగ్గించేసింది.

ప్లస్ పాయింట్స్:
దుల్కర్ సల్మాన్ నటన
కాయదు లోహర్ సన్నివేశాలు
ఆంటోనీ వర్గీస్ ఫ్లాష్ బ్యాక్
సంగీతం
కొన్ని యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్ సాగదీత
కొన్ని రొటీన్ సన్నివేశాలు
ఎడిటింగ్ లోపాలు
కథాంశం పక్కదారి పట్టడం

బాటమ్ లైన్:
దుల్కర్ సల్మాన్ నటన బాగున్నప్పటికీ, రొటీన్ కథనం వల్ల కాస్త నిరాశే మిగులుతుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.

రేటింగ్:  2.5/5

 

డిస్క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com