
రుద్రవీణ.. నటనకి, పాటలకి, సాహిత్యానికి, దర్శకత్వానికి మరణం ఉండదని నిరూపించిన ఆణిముత్యం లాంటి సినిమా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినీ శిఖరం కూడా. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన అభిమానులకి ఫేవరేట్ మూవీతో పాటు సాంగ్స్ అయితే నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుండంతో పాటు ఎంతో మందిలో దైర్యం, కరుణ, ప్రేమ, సమాజంపట్ల బాధ్యతగా ఉండేలా చేసింది.
'డెడ్ పిక్సెల్స్', 'కుమారి శ్రీమతి', 'హాస్టల్ డేస్' వంటి హిట్ సిరీస్‌లలో తన నటనతో అలరించిన అక్షయ్ లగుసాని 'ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రాబోతున్న 'జగమే సంగీతం' అనే మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ 'నాకు ఈ కథ ఆఫర్ రాగానే మొదటగా గుర్తుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ 'రుద్రవీణ' . సంగీతం నేపథ్యంగా సాగే కుటుంబ బంధాలు, సాంప్రదాయాలు, తరాల మధ్య ఘర్షణ అనేవి తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుండెకు హత్తుకునే అంశాలు. 'జగమే సంగీతం'లో నటించడం నా కెరీర్‌లోనే అత్యంత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. వైకుంఠపురం అనే పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సంగీత వారసత్వాన్ని కాపాడుకోవడం, సొంత గుర్తింపును వెతుక్కోవడం వంటి కీలకమైన అంశాలను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ చెప్పుకొచ్చాడు.

Also Read: ఇక నుంచి థియేటర్స్ లో సరికొత్త వెర్షన్: ఈ సారి రొమాన్స్ అంతకు మించి
ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుస్మిత కొణిదెల నిర్మించగా, ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, సుస్మిత శెట్టి కీ రోల్స్ . సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన వీనులవిందైన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక శతాబ్ద కాలపు సంగీత సాంప్రదాయాన్ని, పాప్ సంగీత ప్రపంచాన్ని జతచేస్తూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్, ఓటీటీ వేదికపై ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం కూడా ప్రచార కార్యక్రమాల్లో ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 4 నుండి ఏమినిది ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రానుంది.
[ Chiranjeevi, Prakash Raj, Palnati Surya Pratap, Jagamae Sangeetham, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywoodnews]






