Home

»

Latest News

ఫేక్ కాస్టింగ్ కాల్స్: హెచ్చరించిన నిర్మాణ సంస్థ

Sep 3, 2026 5:02PM

 


నిర్మాణ సంస్థలకి డై హర్డ్ ఫ్యాన్స్ ఉంటారని నిరూపించిన సంస్థ 'వైజయంతీ మూవీస్’. హీరోల అభిమానులకైతే తమ హీరో  'వైజయంతీ మూవీస్’ లో సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ రావడం ఆలస్యం అభిమానులు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి ప్రెస్టేజియస్ట్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి 2 తెరకెక్కిస్తుంది.  ఇప్పుడు  ఈ సంస్థ  పేరు ఉపయోగించి  నటీనటులుగా మారాలనుకునే అమాయక యువతని కొంత మంది మోసం చేస్తున్నారు. దీంతో  'వైజయంతీ' నుంచి ఒక నోట్ రిలీజయ్యింది. 

ఆ నోట్ లో 'తమ బ్యానర్ నిర్మిస్తున్న ఏ సినిమాకూ ఎలాంటి మూడో వ్యక్తి, ఏజెన్సీ లేదా థర్డ్ పార్టీ కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదు. మా నిర్మాణ సంస్థ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి, ఆడిషన్స్ ఇప్పిస్తామని, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికినా, డబ్బులు లేదా ఇతర రుసుములు డిమాండ్ చేసినా  నమ్మకండి. సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో 100 శాతం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. వైజయంతీ మూవీస్ చేపట్టే ప్రతి ఒక్క అధికారిక ఆడిషన్, కాస్టింగ్ కాల్ ప్రకటన కేవలం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, వెరిఫైడ్ ఖాతాల ద్వారా మాత్రమే వెలువడుతుంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్  వెరిఫైడ్ పోస్టులు, ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ నమ్మి ఎవరూ మోసపోవద్దని, తమ వ్యక్తిగత సమాచారాన్ని లేదా సొమ్మును ఎవరికీ అందజేయవద్దని గట్టిగా హెచ్చరించింది.

 

 

Also read: చిరంజీవి రుద్రవీణ గుర్తుకొచ్చింది: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్ 


అంతేకాకుండా తమ సంస్థ పేరుని  అక్రమంగా వాడుకుంటూ ఫేక్ కాస్టింగ్ కాల్స్ నిర్వహిస్తున్న వారిపై, ప్రజలను మభ్యపెడుతున్న సైబర్ క్రిమినల్స్‌పై కఠినమైన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే బాధ్యులపై ఐటీ చట్టాల ప్రకారం ఫిర్యాదు చేయడానికి చర్యలు సిద్ధం చేశామని వైజయంతి సంస్థ పేర్కొనడం సంచలనం సృష్టిస్తుంది.


 [ Vyjayanthi Movies, Prabhas, Ashwinidutt, Fake Casting Calls, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com