Home

»

Latest News

ఒకే సిగరెట్ తాగుతూ కెనీషాతో అడ్డంగా దొరికిపోయిన జయం రవి.. వీడియో వైరల్!

Sep 7, 2026 7:58PM

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొద్దికాలంగా భార్య ఆర్తితో నడుస్తున్న విడాకుల గొడవలు, మరియు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన సాగిస్తున్న ప్రయాణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, మరోసారి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో జయం రవి, సింగర్ కెనీషా ఇద్దరూ చాలా క్యాజువల్‌గా ఒక గ్రూప్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. అయితే అందులో జయం రవి స్వయంగా సిగరెట్ తాగుతూ, మధ్యలో ఆ సిగరెట్‌ను కెనీషాకు అందించడం.. ఆమె కూడా దానిని పీల్చడం స్పష్టంగా రికార్డైంది. ఇద్దరూ ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకుంటున్న ఈ విజువల్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా షాక్‌కు గురిచేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితమే భార్యతో విడాకుల మంజూరు అయ్యే వరకు తాను సినిమాలకు దూరంగా ఉంటానని, అలాగే కెనీషాతో బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ జంట తరచూ కలిసి కనిపిస్తుండటం అందరినీ విస్మరిస్తోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఈ జంట, ఇప్పుడు ఇలా పబ్లిక్‌గా సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగుల్చుతోంది.

గతంలో జయం రవి విడాకుల వార్తలు బయటికి వచ్చినప్పుడు చాలామంది నెటిజన్లు ఆయనకు అండగా నిలిచారు. కానీ, వరుసగా ఇలాంటి వీడియోలు బయటపడుతుండటంతో ఆయనపై ఉన్న గౌరవం కోల్పోతున్నామని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోపై నటుడు జయం రవి గానీ, సింగర్ కెనీషా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ విమర్శలపట్ల ఈ జోడీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

?s=20

 

 

[Jayam Ravi Smoking Video, Ravi Mohan Keneeshaa Francis, Jayam Ravi Divorce News, Telugu Entertainment News, Tollywood Gossip]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com