Home

»

Latest News

ఐ యామ్ గేమ్: దుల్కర్ సినిమాకి బిగ్ షాక్.. చివరి నిమిషంలో షోలు రద్దు.!

Sep 3, 2026 11:40AM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ (I'm Game). 'ఆర్‌డీఎక్స్' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, అండ్ గేమింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకున్న ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.

నేడు ఈ మలయాళ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదల కావాల్సి ఉంది. వేలాది మంది అభిమానులు మార్నింగ్ షోల కోసం టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ల దగ్గర సందడి చేశారు. అయితే, ఆఖరి నిమిషంలో తెలుగు షోలన్నీ హఠాత్తుగా రద్దయ్యాయి. రిలీజ్ టైమ్‌కి షోలు ఆగిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

దీనిపై మూవీ టీమ్ వెంటనే స్పందిస్తూ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. "కొన్ని సాంకేతిక కారణాల వల్లే ‘ఐ యామ్ గేమ్’ తెలుగు వర్షన్ విడుదల కాస్త ఆలస్యమైంది" అని చిత్రబృందం వివరణ ఇచ్చింది. మలయాళంలో మాత్రం ఈ సినిమా ఈరోజే పక్కాగా విడుదలై, అక్కడ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. "ఈ చిన్న ఆలస్యానికి చింతిస్తున్నాం.. త్వరలోనే తెలుగు వెర్షన్ ను కూడా మీ ముందుకు తీసుకువస్తాం" అని టీమ్ వెల్లడించింది.

ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కాయదు లోహర్ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే థియేటర్లలో అలరించనుంది. మరి ఈ సాంకేతిక సమస్యలు పూర్తి చేసుకుని దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ ఎప్పుడు పూర్తి స్థాయిలో థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

 

 

 

[Dulquer Salmaan, I'm Game Movie, Telugu Release, Postponed, Kayadu Lohar, Nahas Hidhayath, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com