Home

»

Latest News

Romanchakam Movie Review Telugu: రోమాంచకం మూవీ రివ్యూ

Sep 3, 2026 10:41AM

 

 

-సినిమా పేరు: రోమాంచకం
-న‌టీన‌టులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్, ఉపేంద్ర లిమాయే, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను, మణి ఆగుర్ల తదితరులు
-సినిమాటోగ్ర‌ఫీ: పవన్ పప్పుల
-మ్యూజిక్: వాసుకి వైభవ్ 
-నిర్మాత‌: ప్రణయ్ రెడ్డి 
-సమర్పణ: సందీప్ రెడ్డి వంగ 
-బ్యానర్: భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్ 
-రచన,దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి 
-రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 3, 2026
 
 

సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్ జంటగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సమర్పణలో తెరకెక్కిన మూవీ 'రోమాంచకం'.  రిలీజ్ డేట్ ఈ రోజే అయినా  నిన్న ప్రీమియర్స్ తోనే థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
అన్వేష్(సుమంత్ ప్రభాస్) హైదరాబాద్ లో నివసించే ఎంతో మంది 'జెన్ జీ' బ్యాచ్ కోవకి చెందిన యువకుడు. మైథిలి( అనంతిక సానిల్ కుమార్).. చెన్నై సిటీలో నివసించే తెలుగు మాట్లాడే 'జెన్ జీ' అమ్మాయి. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ వరకు వెళ్తుంది. దీంతో మైథిలి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. మైథిలిని అన్వేష్ ఒక ఫ్లాట్ లో ఉంచుతాడు. కానీ మైథిలి హఠాత్తుగా మాయమవుతుంది. దీంతో మైథిలి చనిపోవడానికి వెళ్లిందని అన్వేష్ భయపడతాడు. మైథిలి చనిపోవడానికి వెళ్లిందని అన్వేష్ భయపడటానికి కారణం ఏంటి? హైదరాబాద్, చెన్నైలో ఉన్న ఆ ఇద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? వాళ్ళ మధ్య ఉంది నిజమైన ప్రేమేనా? నిజమైన  ప్రేమే అయితే అనంతిక ఎందుకు వెళ్ళిపోయింది? నిజంగా సూసైడ్ చేసుకోవడానికే వెళ్లిందా?  లేదా ఎందుకు వెళ్లిందనేదే 'రోమాంచకం' మూవీ. 

ఎనాలసిస్ 

కథగా చెప్పుకుంటే చాలా సింపుల్ కథ..నేటి జెన్ జీ బ్యాచ్ లో యువతీ, యువకుల మధ్య  కొన్నిప్రేమలు ఎలా పుడుతున్నాయో అదే విధంగా చూపించారు. దీంతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే 'ప్రేమ' అనే మహత్తరమైన పదానికి ఉన్న గొప్పతనం ఇదేనా అనిపిస్తుంది.  ఆడవాళ్లు తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు ఒక వ్యక్తిని ఇష్టపడతారనే పాయింట్ బాగుంది. డైరెక్షన్ తో పాటు టెక్నీకల్ గా మెరుపులు ఉండి ఉంటే రోమాంచకం పొజిషన్ మరోలా ఉండేది.

 

ఫస్ట్ హాఫ్ చూసుకుంటే  అన్వేష్, మైథిలి ఇంట్రడక్షన్ సీన్ బాగున్నాయి. ముఖ్యంగా మైథిలి  ఇంట్రడక్షన్ సీన్ కొత్తగా చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చిన  సీన్స్ లో ఎలాంటి మెరుపులు లేకుండా  రొటీన్ గా సాగుతుంది. దీంతో ఇదేదో తేడాగా ఉందే అనుకుంటాం. కానీ ఆ తర్వాత కామెడీ పర్పస్ కోసమే  వచ్చిన ఫ్రెండ్ సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్ తో పాటు  పెర్ ఫార్మెన్స్ బాగా పేలడంతో ఎంజాయ్ చేస్తుంటాం.  అన్వేష్ చెన్నై వెళ్లే  ఎపిసోడ్ బాగుంది. కానీ అక్కడ కేవలం మైథిలీ తో ఫోన్ మాట్లాడే సీన్ తోనే ఎండ్ చేయకుండా  చెన్నై సిటీలో మైథిలి కోసం వెతకడం చూపించాల్సింది.  మైథిలి హైదరాబాద్ వచ్చి వెంటనే కనపడకుండా వెళ్లిపోయిన సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.

సెకండ్ హాఫ్ లో చూసుకంటే ప్రతి సీన్ ఎంటర్ టైన్ మెంట్ కోణంలో సాగింది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌ (ఉపేంద్ర లిమాయే)తో వచ్చిన టోటల్ ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్. కాకపోతే  మైథిలి ఎందుకు వెళ్లిపోయిందనే బలమైన రీజన్ తో పాటు మైథిలి విషయంలో క్యూరియాసిటీ మిస్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జోష్ తో ఉన్నాయి.


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 
అన్వేష్ గా సుమంత్ ప్రభాస్ తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించాడు. ప్రీవియస్ చిత్రాల కంటే బెటర్ పెర్ఫార్మ్ అని చెప్పవచ్చు. అనంతిక సునిల్ కుమార్ కూడా మైధిలిగా మెప్పించింది. అసలు మైధిలీ అనే పేరు ఆమె కోసమే పుట్టిందా అనేలా కళ్ళతోనే  క్లీన్ పెర్ఫార్మ్ ఇచ్చింది. ఫ్రెండ్స్ క్యారక్టర్ లలో చేసిన అందరు కూడా అద్భుతంగా మెప్పించారు. ముఖ్యంగా నరేంద్ర రవి కామెడీ టైమింగ్ బాగుంది. మరిన్ని అవకాశాలు వస్తే అగ్ర కమెడియన్ గా మారడం ఖాయం.  దర్శకుడిగా వేణుగోపాల్ రెడ్డి పర్వాలేదని అనిపించినా రచన పరంగా సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో మెప్పించాడు.  వాసుకి వైభవ్ నుంచి వచ్చిన సాంగ్స్ కొత్తగా ఉండటంతో పాటు  చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదు.  ఫొటోగ్రఫీ సో సో. నిర్మాణ విలువలు కూడా అదే పరిస్థితి.

బలాలు
1 . ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్ 
2 . సెకండ్ హాఫ్ 
3 . కామెడీ ఎపిసోడ్స్ 
4 . డైలాగ్స్ 

బలహీనతలు 
1 .మెరుపులు లేని డైరెక్షన్ 
2 . హీరోయిన్ క్యారక్టరయిజేషన్ విషయంలో ఉన్న కన్ఫ్యూజ్ 

 

చివరిగా చెప్పుకోవాలంటే కథ, కథనం, దర్శకత్వంలో ఎలాంటి మెరుపులు ఉండవు. కానీ ఫస్ట్ నుంచి,చివరి దాకా నవ్వుతు ఎంజాయ్ చేయవచ్చు.

 

రేటింగ్ 2 .5 /5                                                                 అరుణాచలం  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com