
'ఆర్డీఎక్స్' (RDX) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, మలయాళ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఐయామ్ గేమ్' (I'm Game) ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత దుల్కర్ నటించిన మలయాళ చిత్రం ఇది. దీనికి తోడు ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన 40వ సినిమా కావడం, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో.. ట్విట్టర్ (X) లో జనాలు ఏమంటున్నారో చూద్దాం.
దుల్కర్ సల్మాన్ డ్యాన్ జాన్ అనే కేర్‌లెస్ గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. లక్ ని నమ్ముకుని బెట్టింగ్స్ వేసే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ అండ్ ఫాంటసీ నెట్‌వర్క్‌లో ఎలా చిక్కుకున్నాడు అనేదే కథ. ప్రమోషన్స్ అండ్ ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయని సర్ ప్రైజింగ్ ఫాంటసీ ఎలిమెంట్స్ థియేటర్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని నెటిజన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రతీ సీన్ చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందట.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దుల్కర్ వన్ మేన్ షో అనే చెప్పాలి. మాస్ అవతార్‌లో దుల్కర్ ఎనర్జీ వేరే లెవెల్. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీలో దుల్కర్ విశ్వరూపం చూపించారు. ఇక ఆంటోనీ వర్గీస్ (పెప్పే) పాత్ర సినిమాకి మరో పెద్ద అసెట్. దుల్కర్, పెప్పేల కాంబినేషన్ సీన్స్, వారి మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్స్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ 'లూసర్' సాంగ్ థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి అంటున్నారు.
అయితే, సినిమాలో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయంటున్నారు. సెకండ్ హాఫ్‌లో డ్రామా కొంచెం స్లో అవ్వడం, రన్ టైమ్ దాదాపు 2 గంటల 53 నిమిషాలు ఉండడం వల్ల అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఓవరాల్‌గా నహాస్ హిదాయత్ టేకింగ్, విఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.
ఓవరాల్‌గా ట్విట్టర్ టాక్ చూస్తే.. 'ఐయామ్ గేమ్' మాస్ అండ్ ఫాంటసీ లవర్స్‌కి ఒక పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఈ సినిమా ఒక సాలిడ్ విందు అని చెప్పవచ్చు.
[I'm Game Twitter Review, I'm Game Movie Review, I'm Game Review Telugu, Dulquer Salmaan, Im Game Review, Kayadu Lohar, Nahas Hidhayath, Telugu Film News, Telugu News]






