'అదుర్స్-2' గురించి షాకింగ్ న్యూస్!
on Sep 25, 2022
జూనియర్ ఎన్టీఆర్ లోని కామెడీ యాంగిల్ ని పూర్తి స్థాయిలో బయట పెట్టిన చిత్రం 'అదుర్స్'(2010). వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చారిగా తారక్, భట్టుగా బ్రహ్మానందం తమదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. చారి-భట్టు ట్రాక్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే 'అదుర్స్-2' కోసం కేవలం తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వినాయక్ మాత్రం అదుర్స్ కి సీక్వెల్ ఉండదని చెప్పి షాక్ ఇచ్చాడు.
తారక్ తో 'అదుర్స్-2' చేస్తానని అప్పట్లో వినాయక్ చెప్పేవాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం 'అదుర్స్-2' అనే ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు చెప్పాడు. 'అదుర్స్-2' చేయాలని ఒకట్రెండు స్క్రిప్ట్స్ కూడా అనుకున్నామని.. కానీ అవి అంత సంతృప్తికరంగా అనిపించకపోవడంతో పక్కన పెట్టేశామని చెప్పాడు. 'అదుర్స్' సినిమా తన కెరీర్ లో, తారక్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అని.. సీక్వెల్ పేరుతో ఆ సినిమా పేరుని చెడగొట్టడం ఇష్టంలేకే 'అదుర్స్-2' చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు వినాయక్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేస్తున్న వినాయక్.. ఆ తర్వాత తనే హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.