పుంజుకున్న 'కృష్ణ వ్రింద విహారి'
on Sep 25, 2022

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ 'కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే హిట్ టాక్ రానప్పటికీ మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ పెరగడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.5.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు 95 లక్షల షేర్ రాబట్టగా, రెండో రోజు 1.19 కోట్ల షేర్ తో సత్తా చాటింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.2.14 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.3 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈరోజు(మూడో రోజు) ఆదివారం కావడంతో మరో రూ.1 కోటి షేర్ వసూలు చేసే అవకాశముంది. మరి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 70 లక్షల షేర్, రెండో రోజు 92 లక్షల షేర్ రాబట్టిన ఈ మూవీ రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 1.62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటిదాకా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 10 లక్షల షేర్, ఓవర్సీస్ లో 42 లక్షల షేర్ కలెక్ట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



