
డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ఏడాది ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ షాక్ తర్వాత.. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏడాది భారీ అంచనాలతో పంపిణీ చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో దిల్ రాజుకు డిస్ట్రిబ్యూటర్‌గా కొంత నిరాశ ఎదురైంది. ముఖ్యంగా యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల హక్కుల వ్యవహారం తర్వాత ఆయన తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల పంపిణీ బాధ్యతలు దిల్ రాజుకు అప్పగించినట్లు కథనాలు వస్తున్నాయి. సౌత్ థియేట్రికల్ రైట్స్ యశ్ వద్ద ఉండటంతో, ఆయన ద్వారా ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఇతిహాసంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తొలి భాగాన్ని నవంబర్ 5న విడుదల చేయాలని, నవంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించాలని ప్రణాళిక ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చి, ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘రామాయణం’కు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే దిల్ రాజుకు పంపిణీదారుడిగా మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఎవరీ గరివిడి లక్ష్మి?.. నారా లోకేష్ ట్వీట్‌తో ఒక్కసారిగా చర్చ.!
[Ramayana Telugu Release, Ramayana Movie, Dil Raju, Yash, Ranbir Kapoor, Sai Pallavi, Toxic Movie, Telugu Film News]






