Home

»

Latest News

గ్రామీ అవార్డ్స్ బరిలో ధురంధర్: న్యాయం జరుగుతుందా!అన్యాయం జరుగుతుందా!

Oct 10, 2026 5:50PM


ధురంధర్ సిరీస్ సృష్టించిన సౌండ్ మోత అభిమానులు, ప్రేక్షకుల నుంచి దూరమవ్వడం ఇప్పట్లో కష్టం. అంతలా ప్రభంజనాన్ని తన చుట్టూ అమర్చుకుంది. రీసెంట్ గా  ప్రతిష్టాత్మకమైన 2027 గ్రామీ అవార్డుల (Grammy Awards) బరిలో నిలిచింది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన అద్భుతమైన సంగీతం, సరికొత్త బాణీలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ 'బీ62 స్టూడియోస్' అధికారికంగా ప్రకటిస్తూ, మొత్తం 8 విభాగాలలో గ్రామీ అవార్డుల పరిశీలన కోసం తమ ఆల్బమ్‌ను పంపినట్లు వెల్లడించింది. ఇది భారతీయ సినిమా సంగీతానికి దక్కుతున్న మరో గొప్ప గౌరవంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేవలం ఒరిజినల్ కంపోజిషన్సే కాకుండా, పాత క్లాసిక్ పాటలను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా రీక్రియేట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'ఫిర్ సే', 'ఆరి ఆరి', 'జాయే సజానా' వంటి సూపర్ హిట్ పాటలు గ్రామీ అవార్డుల నామినేషన్ రేసులో వివిధ విభాగాల కింద పరిశీలనకు ఎంపికయ్యాయి. ఇర్షాద్ కమిల్ సహా పలువురు ప్రముఖ గీత రచయితలు అందించిన సాహిత్యం  పాటలకి ప్రాణం పోసింది. అయితే, ఈ ఎంట్రీలు కేవలం గ్రామీ అకాడమీ పరిశీలన కోసం సమర్పించిన ప్రాథమిక దశ మాత్రమేనని, తుది నామినేషన్లు రికార్డింగ్ అకాడమీ యొక్క కఠినమైన అర్హతా ప్రమాణాలు.


 ఇది కూడా చదవండి: బిగ్ బి కి బిగ్ షాక్: నవంబర్ 16 న ఆ సిటీ కోర్టులో హాజరు కావాల్సిందే!

 

 


 గ్రామీ అకాడమీ అవార్డ్స్ సంగీత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు. గ్రామీ ట్రోఫీ బంగారు పూత పూసిన ఒక గ్రామోఫోన్ ఆకారంలో ఉంటుంది. దీనిని "గ్రామియం"అనే ప్రత్యేక లోహంతో జాన్ బిల్లింగ్స్ అనే కళాకారుడు చేత్తో తయారు చేస్తారు. 

 

[Dhurandhar Soundtrack Grammy Awards 2027, Dhurandhar Soundtrack, Grammy Awards 2027, Ranveer Singh movie, Dhurandhar The Revenge, Shashwat Sachdev music, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com