Home

»

Latest News

బిగ్ బి కి బిగ్ షాక్: నవంబర్ 16 న ఆ సిటీ కోర్టులో హాజరు కావాల్సిందే!

Oct 10, 2026 5:20PM

భారతీయ చిత్ర పరిశ్రమ సీనియర్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కి ఢిల్లీ హైకోర్టు నుండి ఊహించని షాక్ తగిలింది.అనుమతి లేకుండా తన పేరు, గొంతు, రూపురేఖలను (పర్సనాలిటీ రైట్స్) కొందరు వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన 2022లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 


ఈ కేసుకు సంబంధించి జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రతివాదులతో జరుగుతున్న సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తి కాకపోతే, తదుపరి విచారణ నాటికి అమితాబ్ బచ్చన్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేసారు.  ఈ వివాదానికి సంబంధించి కొన్ని వర్గాలతో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరినప్పటికీ, లాజిస్టికల్ కారణాల వల్ల ఇంకా అధికారికంగా కాగితాలపై సంతకాలు పూర్తి కాలేదని న్యాయవాదులు తెలిపారు. 


ఇది కూడా చదవండి: '96 'లో జాను రోల్ కి ఎప్పటికి ఫస్ట్ ఛాయస్ ఆ హీరోయిన్ నే: బాంబ్ పేల్చిన దర్శకుడు!   

 

 

దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, అన్ని రకాల న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేయడానికి నవంబర్ 16, వరకు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఒకవేళ నవంబర్ 16 నాటికి కూడా పూర్తి స్థాయి సెటిల్‌మెంట్ కొలిక్కి రాకపోతే మాత్రం, కేసును ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాంటిఫ్ అయిన అమితాబ్ బచ్చన్ కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టు గదిలో ఉండాలని స్పష్టం చేసింది. 


 [Amitabh Bachchan Delhi High Court Shock, Amitabh Bachchan, Delhi High Court, personality rights case, Big B court hearing, Amitabh Bachchan news, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com