Home

»

Latest News

Dil Raju: టాలీవుడ్ చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్!

May 27, 2026 2:34PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న గడ్డు పరిస్థితులను ఆయన ఓపెన్‌గా ఒప్పుకుంటూ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కొత్త తరంపైనే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, "నేను చాలా ధైర్యంగా, ఓపెన్‌గా ఒక నిజం చెబుతాను.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ఈ మాట చెప్పడానికి చాలా మంది భయపడతారేమో కానీ ఇది నిజం. ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే మనందరికీ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా మారింది" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో పూర్వపు సందడి కనిపించడం లేదని, ఇలాంటి టైమ్‌లో చిన్న సినిమాలే ఇండస్ట్రీకి శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

కొత్త కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలు ఎంత పెద్ద విజయం సాధిస్తే, ఇండస్ట్రీ అంత హెల్దీగా ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్, 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ సాయి మార్తాండ్ వంటి పలువురు సక్సెస్‌ఫుల్ కొత్త తరం డైరెక్టర్లను ఆయన ఇన్స్పిరేషన్‌గా అభివర్ణించారు. చిన్న సినిమాగా మొదలై ఎంతటి సంచలనాలు సృష్టించవచ్చో వీరంతా నిరూపించారని, 'సమ్మర్ హాలిడేస్' చిత్రంతో ఇండస్ట్రీకి వస్తున్న కొత్త డైరెక్టర్ శ్రీకర్ నయన్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా అద్భుతమైన సినిమాలు తీయాలని అన్నారు.

ఇక 'సమ్మర్ హాలిడేస్' సినిమా గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో పిల్లల బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటిపోయిందని గుర్తుచేశారు. ఈ సినిమా టీజర్ చూశాక ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ ఎంజాయ్ చేసేలా ఉందని, నిర్మాత ధీరజ్ సినిమాపై ఉన్న ప్యాషన్‌తో రిస్క్ అని తెలిసినా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్‌ఫుల్ రూట్ వేసుకుంటున్నాడని అభినందించారు. తన వంశీ పైడిపల్లి కజిన్ అయిన ధీరజ్, గిరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.

చివరగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దిల్ రాజు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'సమ్మర్ హాలిడేస్' అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అమ్మమ్మ ఊరేనని, టీజర్ ఓపెనింగ్ కూడా అలాగే చాలా రిలేటబుల్‌గా ఉందని చెప్పారు. తన లైఫ్ లో కూడా సమ్మర్ హాలిడేస్ బెస్ట్ మెమరీస్ అన్నీ అమ్మమ్మ ఇంటి దగ్గరే గడిచాయని దిల్ రాజు చెప్పారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com